OTTలోకి అదిరిపోయే హార్రర్ సూపర్ నేచరల్ మూవీ.. ఒళ్లు గగుర్పొడిచేలా చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఓటీటీల హవా ఎక్వువైనప్పటి నుంచి ఎవరికి నచ్చిన చిత్రాలను వాళ్లు చూసే అవకాశం ఎక్కువ అయింది. టీవీల్లో అయితే వాళ్లు వేసినవే చూడాలి.. కానీ ఓటీటీలో మాత్రం మనకు నచ్చిన కొత్త, కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చూడాలి. ముఖ్యంగా ఎక్కువ మంది హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా అదిరిపోయే హార్రర్ సూపర్ నేచురల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సీన్ సీన్ కు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్న హార్రర్ సూపర్ నేచురల్ మూవీయే ది ఫస్ట్ ఒమెన్. బెన్ జాకోబీ కథ నుండి టిమ్ స్మిత్, కీత్ థామస్‌లతో కలిసి స్క్రీన్‌ప్లేను రచించిన అర్కాషా స్టీవెన్‌సన్ దర్శకత్వం వహించిన ఈ క్రేజీ మూవీ ది ఒమెన్ చిత్రానికి ప్రీక్వెల్. అయితే ది ఒమెన్ ఫ్రాంచౌజీలో ఇది ఆరో చిత్రం. ఈ సినిమాలో టైగర్ ఫ్రీ, తౌఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగా, రాల్ఫ్ ఇనెసన్, బిల్ నైఘీ నటించారు. ఈ క్రేజీ మూవీ ఏప్రిల్ 4వ తేదీన ఇటలీలో గ్రాండ్ గా విడుదల అయింది. ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 5వ తేదీన యునైటెడ్ స్టేట్స్‌లో 20వ సెంచరీ స్టూడియోస్ ద్వారా థియేట్రికల్‌గా విడుదలైంది.

Recent Horror Super Natural Movie The First Omen OTT Details Here

రోమ్‌లోని ఒక చర్చిలో పని చేయడానికి పంపబడిన ఒక అమెరికన్ మహిళ.. తన పుట్టక గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే దుష్ట శక్తులు రావడం ఆ కుట్ర గురించి తెలుసుకోవడం వంటివి మనం ఈ స్టోరీలో చూడొచ్చు. అయితే విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద 53.2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టుకుంది. ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Horror Super Natural Movie The First Omen OTT Details Here

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ.. ది ఫస్ట్ ఒమెన్ అనే సినిమా హక్కులను దక్కించుకుంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్న ఈ సంస్థ ఈ క్రేజీ మూవీ రెండు నెలల కూడా కాకముందే ఓటీటీలోకి తీసుకు వస్తుంది. ముఖ్యంగా మే 30వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతన్నట్లు సదరు సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి సినీ ప్రియులు అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. కచ్చితంగా దీన్ని త్వరగా చూడాలని భావిస్తున్నారు. చూడాలి మరిఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X