OTTలోకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ కల్గించే ఈ చిత్రాన్ని అక్కడ చూసేయండి!
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేదికగా వస్తూ సందడి చేస్తున్నాయి. ప్రతీ వారం సరికొత్త కథలతో వస్తూ.. వారం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసేలా చేస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా అదిరిపోయే థ్రిల్లర్, హార్రర్, మిస్టరీ చిత్రాలు వస్తుండగా.. తాజాగా మరో అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. అయితే ఆ సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ ఏంటి, దాన్ని ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సౌమేంద్ర పాధి దర్శకత్వం వహించిన రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా "ఫారే". ఈ సినిమాలో రోనిత్ రాయ్, అలీజ్ అగ్నిహోత్రి, సాహిల్ మెహతా, జైన్ షా, ప్రసన్న బిష్త్, జుహీ బబ్బర్, శిల్పా శుక్లా వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా ఓ థాయ్ సినిమాకు రీమేక్. 2017లో థాయ్ లో వచ్చిన బ్యాడ్ జీనియస్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. దానికి "ఫారే" అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అయితే ఈ మిస్టరీ థ్రిల్లర్ "ఫారే" చిత్రాన్ని 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా మంచి రెప్సాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని గతేడాది నవంబర్ 24వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు. ఇలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బాగానే వసూళ్లు సాధించింది. ఇలా సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దం అవుతుంది.
ముఖ్యంగా నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండగా.. అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అంతా ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా చూడాలనుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 సంస్థ.. ఫారే సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకే దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సంస్థ ఫారే సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతుందో ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ సినిమా జీ5 వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.

అదిరిపోయే కథతో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఫారే చిత్రాన్ని ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ ఎంజాయ్ చేయండి. అనుక్షణం నరాలు తెగే ఉతకంఠ కల్గించే ఈ చిత్రాన్ని అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











