3 ఓటీటీల్లో ఒకేసారి విడుదల కాబోతున్న రీసెంట్ పొలిటికల్ క్రికెట్ మూవీ.. ఎక్కడెక్కడంటే?

ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు ఓటీటీల వేధికగా విడుదల అవుతూ సందడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు, సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను కొనుగోలు చేసేందుకు అనేకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తెగ పోటీ పడుతుంటాయి. కొన్ని పెద్ద చిత్రాలను అయితే ఒకటే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎక్కువ ధరకు దక్కించుకుంటుండగా.. మరికొన్ని చిత్రాలను ఇతర ఓటీటీల్లో కూడా విడుదల చేస్తుంటారు. అంటే ఒకే సినిమాను రెండు మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూసేయొచ్చు. చాలా తక్కువ సార్లు మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది.

అయితే తాజాగా తమిళ సూపర్ హిట్ సినిమా మూడు ఓటీటీల్లో అందుబాటులోకి రాబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వస్తుండడంతో అంతా షాక్ అవుతున్నారు. అలా అని ముందుగా వచ్చే దాంట్లో సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారేమో ఆ వీలు మాత్రే లేదండోయ్. ఎందుకంటే ఈ సినిమాను విడుదల చేసేది మూడు ప్లాట్ పామ్లలో అయినా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Recent Poitical Cricket Movie Blue star Going to Straming on Three OTT Platforms at a Time Check Details

తమిళంలో ఇటీవలే వచ్చిన పొలిటికల్ క్రికెట్ సినిమా బ్లూ స్టార్. క్రికెట్ తో పాటు కులాల మధ్య ఉండే అంతరాలను కూడా చక్కగా చూపించిన ఈ సినిమాను జనవరి 25వ తేదీన థియేటరల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో అశోక్ సెల్వన్ తో పాటు కీర్తి పాండియన్, పృథ్వీ పాండిరాజన్, లిజీ ఆంటోని, శంతను భాగ్యరాజ్, అరుణ్ బాలాజీ, ఎలాంగో కుమారవేల్, భాగవతి పెరుమై వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఎస్. జయ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లెమన్ లీఫ్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్. గణేష్ మూర్తి, జీ. సౌందర్యతో పాటు అతని ప్రొడక్షన్ బ్యానర్ నీలం ప్రొడక్షన్స్‌పై పా. రంజిత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు అలరించడంలో సూపర్ సక్సెస్ అయింది. చాలా మంది ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి తెగ ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేధికగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయనున్నారు.

Recent Poitical Cricket Movie Blue star Going to Straming on Three OTT Platforms at a Time Check Details

అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగానే కాకుండా మరో రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇలా మొత్తం మూడు ఓటీటీల్లోకి ఈ సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సింప్లీ సౌత్, టెంట్ కొట్టాల్లోకి కూడా రాబోతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ సూపర్ హిట్ సినిమాను ఓటీటీ వేధికగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X