OTTలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. అదిరిపోయే ఈ లవ్ స్టోరీని ఎలా చూడాలంటే?

రోజురోజుకూ ఓటీటీల హవా పెరిగిపోతుంది. ఎవరు చూసిన ఓటీటీల్లో సినిమాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. హార్రర్, క్రైమ్, రొమాంటిక్, కామెడీ చిత్రాలను చూస్తూ తెగ సంబురపడిపోతున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీలో అనేక సినిమాలు ఉండగా.. తాజాగా మరో అదిరిపోయే రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యష్ పూరీ, అపూర్వ రావు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా రొమాంటిక్ కామెడీ మూవీయే హ్యాపీ ఎండింగ్. ఈ సినిమాలో యశ్ పూరీ, అపూర్వ రావులతో పాటు విష్ణు, హర్ష్ రోషన్, అనితా చౌదరి, అజయ్ ఘోష్, వంశీ నక్కంటి, ఝాన్సి, కేఎల్కే మణి, శ్వేతలు ప్రధాన పాత్రల్లో నటించారు. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ చిత్రానికి కౌశిష్ భీమిడి దర్శకత్వం వహించారు. అలాగే ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది.

Recent Romantic Comedy Movie Happy Ending OTT Streaming Details Here

కానీ అందరూ ఆశించిన ఫలితాలను మాత్రం రాబట్టుకోలేకపోయిందీ చిత్రం. పురాణాల్లోని శాపాలను తీసుకు వచ్చి మోడ్రన్ లైఫ్ లో ఓ అబ్బాయికి అవి కొనసాగితే లైఫ్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూడొచ్చు. శాపాలు కల్గిన ఓ కుర్రాడు ఓఅమ్మాయిని ప్రేమించడం.. చివరకు ఏమైందనేది ఈ చిత్రంలో తెలుస్తుంది. అదిరిపోయే ఐడియాతో అందరినీ అనుక్షణం ఉర్రూతలూగించేలా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఆ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సంస్థనే ఎక్స్ వేదికగా హ్యాపీ ఎండింగ్ చిత్రం ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంందో వివరించింది. మే 3వ తేదీ అంటే ఈ శుక్రవారం రోజు నుంచి హ్యాపీ ఎండింగ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఆ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ క్రేజీ చిత్రాన్ని ఓటీటీల్లో చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా వేసవి కాలంలో.. మండే ఎండల్లో బయట తిరగడం కంటే కూడా ఈ చిత్రాన్ని ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి చూడడం బెటర్. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇంకెందుకు ఆలస్యం రేపే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాపై ఓ కన్నేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X