OTTలోకి 17 ఏళ్ల కుర్రాడి లైఫ్ స్టోరీ.. టీనేజర్స్ కచ్చితంగా చూడాల్సిన ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల హవా పెరిగిపోతుంది. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలకు క్రేజ్ ఎక్కువ అవుతోంది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు.ఇప్పటికీ ఓటీటీ వేదికగా అనేక కామెడీ చిత్రాలు సందడి చేస్తుండగా.. ఇప్పుడు మరో సూపర్ హిట్ కామెడీ డ్రామా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా 17 ఏళ్ల కుర్రాడి లైఫ్ స్టోరీని చిత్రంగా మలవగా.. అది కాస్తా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
17 ఏళ్ల వయసు కుర్రాడికి సంబంధించిన చాలానే సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి. ముఖ్యంగా వారు సాధించిన సక్సెస్ చేసిన అల్లరిని చూపించారు చాలా మంది. కానీ ఈసారి కొత్తగా డైరెక్టర్ వరుణ్ గ్రోవర్ అదిరిపోయే కథతో వచ్చారు. ఓ కుర్రాడి లైఫ్ లో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కున్నాడు.. లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేశాడనే కథాంశంతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా పేరే ఆల్ ఇండియా ర్యాంక్. అయితే టీనేజర్స్ తో పాటు టీనేజర్స్ ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.

ఆల్ ఇండియా ర్యాంక్ అనే సినిమాను వరుణ్ గ్రోవర్ తెరకెక్కించగా.. శశి భూషణ్, సమతా సుదీక్ష, గీతా అగర్వాల్, షీబా చద్దా, బోధిసత్వ శర్మలు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన విడుదల అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాను థియేటరల్ల వద్ద చాలా మందే ఆసక్తిగా చూసి తెగ ఎంజాయ్ చేశారు. అయితే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదే విషయాన్ని ఈ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా ఏప్రిల్ 19వ తేదీ అంటే రేపటి నుంచే ఈ సినిమా అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది తెగ ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా చూడాలని ప్లాన్ వేసుకుంటున్నారు. అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని మీరు కూడా ఓటీటీ వేదికగా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











