OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ రొమాంటిక్ మూవీ.. 133 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీల హవా పెరుగుతున్నా కొద్దీ అనేక అద్భుతమైన సినిమాలు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న చిత్రాల నుంచి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల వరకు అన్నీ నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తూ సందడి చేస్తున్నాయి. ప్రతీ వారం అద్భుతమైన చిన్న చిత్రాల నుంచి పెద్ద పెద్ద చిత్రాల వరకు వుస్తుండగా... మరో బాలీవుడ్ స్టార్ హీరో 15 రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే చడీ చప్పుడు లేకుండా వచ్చేసిన ఈ సినిమా ఇంతకాలం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలో చూస అవకాశం కల్పించింది.
అయితే బాక్సాఫీసు వద్ద 133 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా పేరే "తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా". బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్లు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. షాహిద్ కపూర్, కృతి సనన్ లతో పాటు ఈ సినిమాలో ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్ కపూర్, కృతి సనన్, ఆశిష్ వర్మ, అనుభ ఫతేపురా, రాకేష్ బేడిలు కీలక పాత్రలు పోషించగా.. అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదట్లో మిక్స్ట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కొంత కాలానికే పుంజుకుని.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇలా మొత్తం రూ.133 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సినిమా విడుదల అయిన నెలన్నర రోజులలోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా మార్చి 22వ తేదీనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబర్చారు.

కానీ ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా.. పలువురు సినిమా చూడలేకపోయారు. కానీ తాజాగా ఈ సినిమాను రెంటల్ విధానం నుంచి తీసేసి ఫ్రీగా ఓటీటీలో చూసేలా అవకాశం కల్పించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. చాలా కాలంగా అమెజాన్ ప్రైమ్ వీడియో.. చాలా సినిమాలను రెంటల్ విధానంలో విడుదల చేస్తూ.. ఆ తర్వాతే ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా చిత్రాన్ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











