Premalu : OTTలోకి సూపర్ హిట్ హైదరాబాద్ లవ్ స్టోరీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

ఇటీవలే మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ప్రేమలు సినిమా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రం అక్కడ బాక్సాఫీసును బద్ధలు చేయగా... తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేశారు. అలా వచ్చి తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మలయాళ భాషలో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అయింది. మొత్తం 156 నిమిషాల నిడివి కల్గిన ఈ లవ్ స్టోరీని కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కించారు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తక్కువ రోజుల్లోనే రూ.70 కోట్ల వరకు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇలా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచన ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేశారు.

Recent Super Hit Premalu Movie Going to Streaming on Disney Plus Hotstar Check Details

మార్చి 8వ తేదీన తెలుగులో విడుదల అయిన ఈ హైదరాబాద్ ప్రేమలు సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లు రాబట్టింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నస్లేన్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందింది. పుష్ప విలన్ ఫహాద ఫాజిల్​ కూడా నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో మాత్రం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు, యువ నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ రిలీజ్ చేశారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి వంటి స్టార్ లు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రీవ్యూలు ఇచ్చారు. దీంతో ఈ సినిమాను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇలా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

Recent Super Hit Premalu Movie Going to Streaming on Disney Plus Hotstar Check Details

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా మార్చి 29వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని అందరూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మార్చి 29వ తేదీ నుంచి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అస్సలే మిస్ అవకుండా ఈ చిత్రాన్ని చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X