OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఎక్కువగా థ్రిల్లర్, హార్రర్ సినిమాలు వస్తున్నాయి. అందరూ వీటిని ఎక్కువగా చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండగా.. దర్శక, నిర్మాతలు కూడా ఇలాంటి చిత్రాలనే తీసుకు వస్తున్నారు. అయితే ఓ సరికొత్త సర్వైకర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చినా అందరూ చేసే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా ఫ్రీగా చూసే అవకాశం వచ్చింది. అయితే ఈ రీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఏంటి, అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2023వ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన విడుదల అయిన ఓ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ యే జొరమ్. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించగా.. మనోజ్ బాజ్ పేయీ ప్రధాన పాత్రలో ఈ చిత్రం వచ్చింది. ముఖ్యంగా మఖిజా ఫిల్మ్‌తో కలిసి డైరెక్టర్ దేవాశిష్ మఖిజానే జీ స్టూడియోస్ నిర్మించింది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి సరసన తన్నిష్ఠ ఛటర్జీ నటించింది. అంతేకాకుండా రాజశ్రీ దేశ్ పాండే, మహమ్మద్ జీషన్ ఆయుబ్, స్మితా తాంబే వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాన్ని విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. 2023 ఫిబ్రవరిలో నెదర్లాండ్స్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోరట్ డ్యామ్ లో తొలిసారి ప్రదర్శించగా.. జూన్ లో ఆస్ట్రేలియా సిడ్నీలో 70వ సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ లో చూపించారు. ఆ తర్వాత జులైలో డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దక్షిణాఫ్రికాలో, అక్టోబర్ లో దక్షిణ కొరియాలో జరిగిన 28వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు అదే నెలలో చికాగోలో 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
ఇప్పటికే మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన ఓటీటీలోకి వచ్చేసింది. కానీ రెంటల్ విధానంలో మాత్రమే ఈ చిత్రం అప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి నెల గడిచిపోతుండగా.. తాజాగా అందరికీ అందుబాటులోకి వచ్చిందీ చిత్రం. ప్రస్తుతం ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

అదిరిపోయే కథాంశంతో వచ్చి అందరినీ మెప్పించిన ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కూడా చూసేయండి ఈ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ ని. ఈ చిత్రాన్ని మిస్ అయ్యారంటే మీరు ఎంతో మిస్ అయినట్టే.


Click it and Unblock the Notifications











