OTTలోకి వచ్చేసిన సూపర్ నాచురల్ హార్రర్ థ్రిల్లర్.. క్షణ క్షణం భయపెట్టే ఈ చిత్రాన్ని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో హార్రర్, థ్రిల్లర్, కామెడీ చిత్రాల హవా ఎక్కువ అయిపోయింది. సినీ ప్రియులు అందరూ ప్రస్తుతం ఇలాంటి చిత్రాల మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండగా.. అది అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలతోనే వస్తూ హిట్లు కొడుతున్నారు. ముఖ్యంగా పార్ట 1 హిట్ అయిందంటే దానికి సీక్వెల్స్ కూడా తీసుకువస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీల్లో అనేక హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఉండగా.. తాజాగా మరో సూపర్ నాచురల్ హార్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమా ఏంటి, దాన్ని ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అదిరిపోయే కాన్సెప్ట్ తో సూపర్ నాచురల్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రీసెంట్ చిత్రమే అవతార పురుష 2. అయితే గతంలో అవతార పురుష అనే పేరుతో వచ్చిన పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ను తీసుకు వచ్చారు. అయితే పార్ట్ 1లో హీరోహీరోయిన్లుగా చేసిన శరణ్, అషికా రంగనాథ్ లే ఈ సినిమాలోనూ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే సాయి కుమార్, భవ్య , బాలాజీ మనోహర్, శ్రీనగర్ కిట్టి, సుధారాణి, అశుతోష్ రానా, విజయ్ చెందూర్, బి సురేష్, సాధు కోకిల, మంథన, పాత్రే నాగరాజ్ సహాయక పాత్రల్లో నటించారు.

ఈ క్రేజీ మూవీకీ సుని దర్శకత్వం వహించగా.. ది పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పుష్కర మల్లికార్జునయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అభినందన్ కశ్యప్ సంగీతం అందించగా, విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇలా అదిరిపోయే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే పార్ట్ 1 సాధించినంత హిట్ కొట్టలేకపోయినా థియేటర్ల వద్ద ఫర్వాలేదనిపించిందీ చిత్రం. కేవలం కన్నడ భాషలో మాత్రమే ఉన్న ఈ చిత్రం సైలెంట్ గా నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఈరోజు నుంచే ఈ చిత్రం అందుబాటులోకి రాగా అంతా ఆసక్తిగా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. విపరీతమైన ఎండల్లో బయట తిరిగి టైమ్ పాస్ చేయడం కంటే కూడా.. ఇంట్లోనే కూర్చుని.. హాయిగా ఫ్యామిలీతో కలిసి ఓటీటీ వేదికగా ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలను చూడండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి. హార్రర్, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వాళ్లు మాత్రం ఈ చిత్రాన్ని అస్సలే మిస్ కాకండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లిపోండి.


Click it and Unblock the Notifications











