OTTలోకి సర్వైవల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ.. నరాలు తెంపే ఉత్కంఠ కల్గించే దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలతో పాటు హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాల హవా ఎక్కువ అవుతోంది. ఈ మధ్య అందరూ ఇలాంటి చిత్రాలే చూస్తూ ఫుుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకుంటున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటివే తీసుకు వస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రైమ్, థ్రిల్లర్, హార్రర్ చిత్రాలు ఓటీటీలో ఉండగా.. మరో క్రేజీ సర్వైవల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ క్రేజీ మూవీ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పీవీ శంకర్ దర్శకత్వంలో వచ్చి రీసెంట్ సర్వైవల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీయే కాల్వన్. జీవీ ప్రకాష్, భారతీ రాజా, ఇవానా, ధీనాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ మూవీని డిల్లీ బాబు నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి పీవీ శంకర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. శాన్ లోకేష్ ఎడిటర్ గా పని చేశారు. అలాగే వినోద్ మున్నా, జ్ఞాన సంబంధం మారుతుపాండి వంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో కనిపించారు.

ఏప్రిల్ 4వ తేదీన థియేర్లలో విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. ఈ సినిమా అసలు కథ ఏంటంటే.. నలుగురు స్నేహితులు డబ్బుల కోసం ఓ ఏనుగును పట్టుకునే పనికి ఒప్పుకుంటారు. అయితే ఈ ఏనుగును పట్టుకునే క్రమంలోనే ఓ అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో పడతాడు. చివరకు వీరి ఏనుగును పట్టుకున్నారా, వీరి ప్రేమ కథ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అద్భుతమైన కథాంశంతో వచ్చినా థియేటర్ల వద్దగా పెద్దగా ఆడని ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సర్వైవల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా ఈ సంస్థే నేరుగా ప్రకటించింది. మే 14వ తేదీ నుంచి కాల్వన్ అనే చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. మీరు కూడా ఈ క్రేజీ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మే 14 నుంచి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











