OTTలోకి నవ్విస్తూనే భయపెట్టే నయా సూపర్ హిట్ ఫిల్మ్ .. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి సినిమాలు ఓటీటీ వేధికగా వచ్చేస్తున్నాయి. థియేటర్లకు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియకముందే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా, బాగానే అలరించినా పెద్ద సినిమాల తాకిడితో థిటేర్లు దొరక్క త్వరగా బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి సమస్యలతోనే ఓ సూపర్ హిట్ ఫిల్మ్ నెల రోజులు కూడా కాముందే ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ సినిమా ఏంటి, ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమానే కన్జూరింగ్ కన్నప్పన్. తమిళ భాషా హార్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అర్చన కళాపతి, అఘోరం కళాపతి, సురేష్ కళాపతి, కళాపతి గణేష్ లు నిర్మించారు. మహేష్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించి ఈ చిత్రంలో నాజర్, ఆనంద రాజ్, శరణ్య శరణ్య పొన్వన్నన్, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీలు ప్రధాన పాత్రలు పోషించారు. అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన కోలీవుడ్ లో గ్రాండ్ గా విడుదల చేశారు.

మొదటి రోజు నుంటి పాజిటివ్ టాక్ తెచ్కుకున్న ఈ చిత్రం అతి తక్కువ కాలంలో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే థియేటర్లకు పెద్ద చిత్రాల తాకిడి ఎక్కువగా ఉండడంతో త్వరగానే థియేటర్ల వద్ద నుంచి వెళ్లిపోయింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు యువ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అలాగే విష్ణు ఎడ్వన్, విఘనేష్ రామకృష్ణలు పాటలు రాశారు. మోహన మహేంద్రన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయగా... మీనాక్షి నాయుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు.

సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ హార్రర్ కామెడీ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రుముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా కన్జూరింగ్ కన్నప్పన్ అందుబాటులోకి రాబోతుంది. జనవరి 5వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే తమిళ భాష సినిమానే అయినప్పటికీ ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ అద్భుతమైన సినిమాను ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











