For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Saakini Daakini OTT: షాకింగ్.. రిలీజైన 2 వారాలకే ఓటీటీలోకి.. పాపం రెజీనా, నివేదా

  |

  ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువగా కొనసాగుతోంది. కంటెంట్ బాగుంటే తప్పా థియేటర్లలో సినిమాలు వీక్షించేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. అందుకు బింబిసార, కార్తికేయ 2 వంటి చిత్రాలే ఉదాహరణ. ఎంతో హైప్ తో వచ్చిన పెద్ద సినిమాలు సైతం చతికిలపడి విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీల్లో రిలీజ్ చేసే పరిస్థితి వస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైల లైగర్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నెల రోజులు తిరగకముందే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజైన రెండు వారాలకే ఓటీటీల్లో ప్రసారం కానుంది ఓ సినిమా. ఆ వివరాల్లోకి వెళితే.

  యాక్టింగ్ సూపర్బ్..

  యాక్టింగ్ సూపర్బ్..

  టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రెజీనా కసండ్రా, నివేదా థామస్ కలిసి నటించిన చిత్రం శాకిని డాకిని. ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీలో రెజీనా కసండ్రా, నివేదా థామస్ యాక్టింగ్ సూపర్బ్ గా ఉందని ప్రశంసలు వచ్చిన సినిమా మాత్రం అంతా ఆకట్టుకోలేదని టాక్ వినిపించింది.

   సుధీర్ వర్మ దర్శకత్వంలో..

  సుధీర్ వర్మ దర్శకత్వంలో..

  నివేదా థామస్, రెజీనా కసండ్రాతో పాటు లహరి షారీ, జాన్సన్ డీఎం, రవికుమార్ అనేజా తదితరులు నటించిన ఈ సినిమాకు స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్ గా..

  మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్ గా..

  కొరియన్ లాంగ్వేజ్ లో సూపర్ హిట్ సాధించిన మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్ గా షాకిని డాకిని చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అయితే లేడీ మల్టిస్టారర్ గా వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదనే టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనట్లు తెలుస్తోంది.

  అర్ధరాత్రి నుంచే..

  అర్ధరాత్రి నుంచే..

  ఇక చేసేది లేక ఈ చిత్రాన్ని ఓటీటీల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ మూవీని సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అంటే సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగా ఈ మూవీని ఓటీటీ కోసమే తెరకెక్కించారట. ఆ తర్వాత ఆలోచన మార్చుకున్న నిర్మాతలు థియేటర్లలో విడుదల చేశారని సమాచారం.

   విడుదలకు ముందే..

  విడుదలకు ముందే..

  విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సినిమా కథ విషయానికొస్తే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు అమ్మాయిలు ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో తెరకెక్కింది. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన షాకిని డాకిని ప్రేక్షకులను నవ్వించడంతోపాటు థ్రిల్ ను పంచడంలో విఫలమైందని టాక్.

  రెజీనా అడల్ట్ జోక్..

  రెజీనా అడల్ట్ జోక్..

  కాగా నివేదా థామస్ ఇటీవల వకీల్ సాబ్ లో నటించగా, రెజీనా కసాండ్ర హార్రర్ వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్ తో పలకరించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రెజీనా నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో రెజీనా అడల్ట్ జోక్ వేసిన విషయం తెలిసిందే. ''అబ్బాయిలు.. మ్యాగీ రెండు ఒక్కటే. రెండు రెండు నిమిషాల్లో అయిపోతాయి'' అంటూ జోక్ వేసింది రెజీనా కసాండ్ర.

  English summary
  Tollywood Beautiful Heroine Regina Cassandra And Nivetha Thomas Starrer Movie Saakini Daakini Will Streaming On OTT Netflix From September 30.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X