ఒక్కటైన రిలయన్స్, డిస్నీ: ఒకే చోట 2 ఓటీటీలు, 120 ఛానెళ్లు.. చాలా తక్కువ ధరకే!

గతంలో కంటే ఇప్పుడు ఓటీటీల వాడకం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ముఖ్యంగా ఇండియాలో ఇవి వేగంగా వృద్ది చెందుతున్నాయి. ఫలితంగా ఎన్నో కొత్త కొత్త ప్లాట్‌ఫాంలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు భారీ కంపెనీల మధ్య తాజాగా పెద్ద డీల్ జరిగింది. అవే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ కంపెనీలు. ఇండియాలో తమ మీడియా వ్యాపారాలను విలీనం చేసేందుకు రెండు కంపెనీలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా అధికారికంగా ఒప్పందంపై సంతకం చేశాయి. తద్వారా ఓటీటీ రంగంలో ఎన్నో మార్పులు జరగనున్నాయి. ఆ వివరాలు మీకోసమే!

వినోద రంగంలో బిగ్ డీల్:రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనానికి ఫిబ్రవరి 28 ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశ్రమలోని ఇతర సంస్థలను అధిగమించి 8.5 బిలియన్ డాలర్లు (రూ. 70,352 కోట్లు)తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి. ఫలితంగా దేశ ఎంటర్‌టైన్‍మెంట్ రంగంలోనే ఇది అతిపెద్ద విలీనంగా నిలిచింది.

Reliance and Disney merge media business in India

రిలయన్స్ భారీ మొత్తం:జాయింట్ వెంచర్ (జేవీ) ద్వారా వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను ఏకం చేస్తుంది. విలీనం తర్వాత జేవీని ప్రధానంగా రిల్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో వయాకామ్18 సంస్థకు 46.82 శాతం, 36.84 శాతం డిస్నీ యాజమాన్యం కలిగి ఉంటుంది. రిలయన్స్, ఇతర అనుబంధ సంస్థలు కలిసి కంపెనీలో 60 శాతం (మెజారిటీ) కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంటాయి. జేవీలో రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంతకం చేసేసింది.

120 ఛానెళ్ల వీటిలోనే:రిలయన్స్ - డిస్నీ సంస్థల విలీనం తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా టీవీ ఛానెళ్లు విలీనం కానున్నాయి. అంటే వయోకామ్ 38 ఛానళ్లు, స్టార్ ఇండియా 70 ఛానళ్లు ఇలా మొత్తంగా 120 ఛానెళ్లు ఈ ఒప్పందం ద్వారా ఒక్క చోటకు చేరబోతున్నాయి.

Reliance and Disney merge media business in India

ఒక్కటైన 2 ఓటీటీలు:జాయింట్ వెంచర్ ద్వారా ఈ రెండు సంస్థల ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు జియో సినిమా, హాట్‍స్టార్ కూడా జాయింట్‌గా పని చేయబోతున్నాయి. అంటే ఐపీఎల్ సహా స్టార్, వయాకామ్ 18 పరిధిలో వచ్చే సీరియళ్లు, సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు కూడా ఈ జేవీ పరిధిలోకే రాబోతున్నాయి. దీంతో ఓటీటీ ప్రియులకు మరిన్ని ఎక్కువ సేవలు ఒకే చోట దొరకబోతున్నాయని చెప్పొచ్చు.

తక్కువ ధరకే ఇచ్చేలా:ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే అతి పెద్ద డీల్ జరిగిన తర్వాత రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అదిరిపోయే గుడ్ న్యూస్‌ను కూడా చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే కంటెంట్‍ను అందించేందుకు ఈ జాయింట్ వెంచర్ రెడీగా ఉందని వెల్లడించారు. అంటే.. చాలా తక్కువ ధరలోనే రెండు ఓటీటీలు, పలు ఛానెళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

Reliance and Disney merge media business in India

నీతా అంబానీనే చైర్మన్:రిలయన్స్, డిస్నీ ఇండియా విలీన ఒప్పందంలోనే మేనేజింగ్ కమిటీని కూడా ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్‌కు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గతంలో నివేదించిన విధంగానే చైర్‌పర్సన్‌గా ఉంటారని ప్రకటించారు. అలాగే, ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని కంపెనీలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X