For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Upcoming Releases: రిపబ్లిక్ డే మూవీ ఫెస్టివల్.. ఏకంగా 16 సినిమాలు, ఆ ఒక్క రోజు మాత్రం!

  |

  2023 సంవత్సరం స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. దాదాపుగా అందరూ మంచి హిట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా తెలుగు హీరోలు చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ సందడి చేయగా కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలతో సందడి చేశారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత మరోసారి థియేటర్లు సందడిగా మారనున్నాయి. అయితే ఈసారి పెద్ద హీరోతో పాటు పలు చిన్న సినిమాలు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. జనవరి చివరి వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లలో మొత్తంగా 16 సినిమాలు విడుదల అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా!

  కాంట్రవర్సీ మూవీ 'పఠాన్'..

  కాంట్రవర్సీ మూవీ 'పఠాన్'..

  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యాక మరెన్ని అభ్యంతరాలు ఎదురవుతాయో చూడాలి.

  సుధీర్ బాబు 'హంట్'..

  సుధీర్ బాబు 'హంట్'..

  నిట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. ఈ సినిమాకు మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. మెమోరీ లాస్ అయిన పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ ను ఎలా ఇన్వేస్టిగేట్ చేశాడన్నదే ప్రధానంశంగా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

  శివ బాలాజీ 'సింధూరం'..

  శివ బాలాజీ 'సింధూరం'..

  టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ చాలా కాలం తర్వాత నటించిన సినిమా సింధూరం. నక్సలైట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లో జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. హరి గౌరవ సంగీతం అందించిన ఈ సినిమాలో శివ బాలాజీ, ధర్మ మహేష్, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రలు పోషించారు.

  'గాంధీ-గాడ్సే: ఏక్ యుధ్'

  'గాంధీ-గాడ్సే: ఏక్ యుధ్'

  సుమారు 9 ఏళ్ల తర్వాత డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి మరోసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన సినిమా 'గాంధీ-గాడ్సే: ఏక్ యుధ్'. దీపక్ అనంతని, చిన్మయి మండేల్కర్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమాతో రాజ్ కుమార్ సంతోషి కుమార్తె తనీషా సంతోషి తెరంగేట్రం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మనీలా సంతోషి నిర్మాతగ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అస్ఘర్ వజాహత్, రాజ్ కుమార్ సంతోషి మాటలు అందించారు. అలాగే వీటితోపాటు జనవరి 27న Who Am I అనే మరో సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

  నిఖిల్-అనుపమ '18 పేజీస్'..

  నిఖిల్-అనుపమ '18 పేజీస్'..

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా కలిసి నటించిన చిత్రం 18 పేజీస్. కరెంట్, కుమార్ 21F వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలై మంచి విజం సాధించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా జనవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే జనవరి చివరి వారంలో మొత్తంగా 16 సినిమాలు విడుదల కాగా జనవరి 26న ఒక్కరోజే 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  నెట్ ఫ్లిక్స్

  నెట్ ఫ్లిక్స్

  నార్విక్ (హాలీవుడ్)- జనవరి 23
  బ్లాక్ సన్ షైన్ బేబీ (డాక్యుమెంటరీ చిత్రం)- జనవరి 24

  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
  ఎక్స్ ట్రార్డినరీ (Extraordinary Web Series)- జనవరి 25
  డియర్ ఇష్క్ (హిందీ)- జనవరి 26
  సాటర్ డే నైట్ (మలయాళం)- జనవరి 27

  జీ5

  జీ5

  రెజీనా కాసాండ్రా 'జాన్ బాజ్ హిందుస్థాన్ కీ' (తెలుగు, హిందీ, తమిళం)- జనవరి 26
  అయలీ (తెలుగు, తమిళ సిరీస్)- జనవరి 26

  అమెజాన్ ప్రైమ్ వీడియో:
  ఎంగ్గా హాస్టల్ (తమిళం)- జనవరి 27
  యాక్షన్ హీరో (హిందీ)- జనవరి 27
  షాట్ గన్ వెడ్డింగ్ (హాలీవుడ్)- జనవరి 27

  English summary
  New 16 Upcoming Movies And Web Series In Theaters And OTT Releases Of January Fourth Week 2023 List Is Here On Republic Day Movie Festival 2023. 7 Movies On January 26 2023.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X