Retro OTT Release: ఓటీటీలోకి రెట్రో.. సూర్య మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను రెట్రో అందుకోలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి వచ్చేందుకు రెట్రో రెడీ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..
రెట్రో బడ్జెట్ ఎంతంటే?
సూర్య కెరీర్‌లో 44వ చిత్రంగా తెరకెక్కిన రెట్రోలో పూజా హెగ్డా హీరోయిన్‌గా నటించారు. జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్, శ్వాసిక తదితరులు రెట్రోలో కీలకపాత్ర పోషించారు. నాటి హీరోయిన్ శ్రీయా శరణ్ ఇందులో స్పెషల్ సాంగ్‌లో నర్తించారు. స్టోన్ బీచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేకర్ పాండియన్‌లు సంయుక్తంగా రెట్రోను దాదాపు రూ.65 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా.. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

రెట్రో బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్
సూర్య క్రేజ్, టీజర్ , ట్రైలర్లతో పాటు పూజా హెగ్డే చేసిన కనిమా సాంగ్‌తో రెట్రో జనాల్లోకి బాగా వెళ్లింది. దీనికి తగినట్లుగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రెట్రో. సూర్య సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
సూర్యకు తమిళంతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగులో రెట్రోను సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. నైజాంలో రూ.3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.60 కోట్లు, ఆంధ్రలో రూ.4.40 కోట్లు చొప్పున ఈ సినిమా బిజినెస్ చేసింది. ఆంధ్ర, నైజాంలలో రెట్రో లాభాల్లోకి రావాలంటే రూ.10.50 కోట్ల షేర్.. రూ. 21 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర
అటు రెట్రో నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను రూ.80 కోట్లకు.. హిందీ రైట్స్‌ను రూ.25 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా కోలీవుడ్ టాక్. రెట్రో శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ దక్కించుకుంది.
రెట్రో కలెక్షన్స్
రెట్రో కలెక్షన్స్ విషయానికి వస్తే.. 26 రోజుల వరకు ఈ సినిమా ఇండియా వైడ్ నికరంగా రూ.60.47 కోట్లు, రూ.71.35 కోట్ల గ్రాస్ రాబట్టింది. సూర్యకి ఓవర్సీస్‌లో ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో ఆ ఏరియాలో ఏకంగా రూ.27 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మొత్తంగా 26 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రెట్రో మూవీకి రూ.98 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రాష్ట్రాల వారీగా కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.6.68 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.8.07 కోట్లు, తమిళనాడులో రూ.50.55 కోట్లు, కేరళలో రూ.4.63 కోట్లు, హిందీలో రూ.1.04 కోట్లు రెట్రోకు వచ్చాయి. అయితే ఈ కలెక్షన్స్‌తో రెట్రో బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోవడంతో సూర్య మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రెట్రో ఓటీటీలోకి ఎప్పుడంటే?
రెట్రోను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీని గురించి ఇంటర్నెట్‌ను తెగ జల్లెడ పట్టేస్తున్నారు. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే మేకర్స్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. మే 31 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రెట్రో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మరి థియేటర్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న రెట్రో.. ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











