Retro OTT Release : ఓటీటీలోకి రెట్రో .. సూర్య మూవీ ఎప్పుడొస్తుందంటే? ఏ ఓటీటీలో అంటే?

గతేడాది ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కంగువా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం కావడంతో కోలీవుడ్ స్టార్ సూర్య అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అప్పుడెప్పుడో జై భీమ్ తర్వాత మరో హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సూర్య. కానీ ఆయనకు అదృష్టం కలిసి రావడం లేదు. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో. కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెట్రో ఓటీటీ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Retro OTT Release when to expect suriya pooja Hegde s movie to stream online

సూర్య కెరీర్‌లో 44వ చిత్రంగా తెరకెక్కింది రెట్రో. ఇందులో ఆయన సరసన పూజా హెగ్డా హీరోయిన్‌గా నటించారు. జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్, శ్వాసిక తదితరులు రెట్రోలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ ఇందులో ఐటెం సాంగ్ చేశారు. స్టోన్ బీచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేకర్ పాండియన్‌లు సంయుక్తంగా రెట్రోను దాదాపు రూ.65 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా.. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

సూర్య క్రేజ్, టీజర్ , ట్రైలర్లతో రెట్రోపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఆడియో రిలీజ్ తర్వాత రెట్రోపై బజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే రెట్రోను సూర్య, జ్యోతికలు తమిళంలో స్వయంగా రిలీజ్ చేయడంతో అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రెట్రో. సూర్య సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తెలుగులో రెట్రోను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. నైజాంలో రూ.3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.60 కోట్లు, ఆంధ్రలో రూ.4.40 కోట్లు చొప్పున బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెట్రో క్లీన్ హిట్ కావాలంటే రూ.10.50 కోట్ల షేర్.. రూ. 21 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

మరోవైపు.. రెట్రో నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను రూ.80 కోట్లకు.. హిందీ రైట్స్‌ను రూ.25 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా కోలీవుడ్ టాక్. ఇక రెట్రో శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఈ సినిమాకు అయిన వ్యయంలో సగానికి పైగా డిజిటల్, శాటిలైల్ రైట్స్ అమ్మకాలతోనే తిరిగి వచ్చినట్లుగా కోలీవుడ్ టాక్.

థియేటర్‌లోకి వచ్చి గంటలు గడవకముందే రెట్రో ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీని గురించి ఇంటర్నెట్‌ను తెగ జల్లెడ పట్టేస్తున్నారు. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే మేకర్స్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారంలో రెట్రోలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: Retro suriya pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X