Citadel Web Series Review ప్రియాంక చోప్రా హై యాక్షన్ డ్రామా.. సిటాడెల్ ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రియాంక చోప్రా జోనస్, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుసీ, లెస్లే మ్యాన్ విల్లే, ఆష్లై కమ్మింగ్స్, రోనాల్డ్ మాలెర్ తదితరులు
రూపకర్తలు: జోష్ అప్పేలబ్బామ్, బ్రయన్ ఓ, డెవిడ్ వెల్
నిర్మాతలు: జో రూసో,ఆంథోని రుసో
సినిమాటోగ్రఫి: న్యూటన్ థామస్ సిగెల్
బడ్జెట్: 300 కోట్లు
బ్యానర్: గోజీ ఏజీబీవో, మిడ్‌నైట్ రేడియో
ఎపిసోడ్ నిడివి: 40 నిమిషాలు
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-04-28
సిటాడెల్ కథ ఏమిటంటే?: నదియా షా (ప్రియాంక చోప్రా జోనస్), మాసన్ కానే (రిచర్డ్ మ్యాడెన్) సిటాడెల్ అనే గూఢచారి సంస్థలో ఏజెంట్స్‌గా పనిచేస్తుంటారు. దేశ భద్రతలకు సవాల్ విసిరుతూ దుష్ట పన్నాగాలు పన్నుతున్న మాంటికోర్ అనే సంస్థను ఎదుర్కొనేందుకు నదియా, మాసన్ సిద్దమవుతారు. ఆ క్రమంలో వారిద్దరూ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దాడి చేస్తారు. ఆ దాడిలో నదియా, మాసన్ తమ గతాన్ని మరిచిపోతారు.

సిటాడెల్‌లో ట్విస్టులు: ట్రైన్‌లో జరిగిన దాడి నుంచి నదియా, మాసన్ ఎలా తప్పించుకొన్నారు. నదియా షా తన గతం మరిచిపోయిన తర్వాత ఏం జరిగింది? సిటాడెల్‌పై మాంటికోర్ ఎందుకు దాడి చేస్తుంది? మాంటిడెల్‌ను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? గత మరిచిన నదియాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే సిటాడెల్ సిరీస్ కథ.
సిటాడెల్ ఎలా ఉందంటే?:ట్రైన్ ఎపిసోడ్‌లో మంచి యాక్షన్ సీక్వెన్స్‌తో సిటాడెల్ సిరీస్ హై రేంజ్‌లో మొదలవుతుంది. భారీ ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా చిత్రీకరించారు. రక్తం, భారీ హింసగా యాక్షన్ ఎపిసోడ్ కొనసాగుతుంది. అయితే ట్రైన్‌ను పేల్చివేయడంతో సిరీస్‌లో అసలు ట్విస్ట్ మొదలువుతుంది. అయితే నదియా, మ్యాడెన్ గతం మరిచిపోయిన అంశం కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌గా మారుతుంది.

యాక్షన్ ఎపిసోడ్స్‌తో: సిటాడెల్ సిరీస్ రెండు ఎపిసోడ్స్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్ ది హ్యుమన్ ఎనిగ్మా, రెండో ఎపిసోడ్ స్సీసిస్ అప్పియర్ ఇన్ ది నైట్ ను ప్రేక్షకుల మందుకు తెచ్చారు. ఈ రెండు ఎపిసోడ్‌లో కూడా భారీగా యాక్షన్, సైంటిఫిక్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రియాంక చోప్రా చేసిన యాక్షన్, ఫైట్స్ సీక్వెన్స్ ఈ సిరీస్‌కు హైలెట్‌గా నిలిచాయి.
ప్రియాంక చోప్రా జోనస్ ఫెర్ఫార్మెన్స్: సిటాడెల్ సిరీస్ ద్వారా ప్రియాంక చోప్రా జోనస్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో కనిపించారు. హోరాహోరీగా విలన్ బ్యాచ్‌తో చేసే ఫైట్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. కష్టాన్ని లెక్క చేయకుండా ప్రియాంక చోప్రా ఫైట్స్ సీన్లలో నటించడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లో గ్లామర్ పంట పండించింది. మ్యాడెన్ కూడా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?: సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తంగా రెండు ఎపిసోడ్స్ కూడా పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్‌కే పరిమితమయ్యాయి. ఫైట్స్‌ను ఫుల్ ఎనర్జీతో తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ సఫలమయ్యాడు. మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ విభాగాలు పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్. నిర్మాణ విలువలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగాలేదని చెప్పవచ్చు.

ఫైనల్ జడ్జిమెంట్: సిటాడెల్ సిరీస్‌లో మొదటి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయంతోనే సరిపోయిందనిపిస్తుంది. సిటాడెల్, మాంటికోర్ మధ్య అధిపత్య పోరాటం బ్యాక్ డ్రాప్‌గా రెండు ఎపిసోడ్స్ కొనసాగాయి. యాక్షన్, గ్లామర్, సైంటిఫిక్ అంశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. యాక్షన్ సినిమాలు, స్పై థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. మూడో ఎపిసోడ్ మే 5న స్ట్రీమింగ్ కానున్నది. రానున్న ఎపిసోడ్స్‌లో కథాపరంగా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











