Jubilee Web Series Review సినీ పరిశ్రమలో కుట్రలు, రాజకీయాల నేపథ్యంగా.. ఆకట్టుకొన్న అదితిరావు హైదరీ!
నటీనటులు: అదితి రావు హైదరీ, శ్వేత బసు ప్రసాద్, అపర్‌శక్తి ఖురానా, ప్రొసేన్‌జిత్ చటర్జీ, సిద్దాంత్ గుప్తా, వమికా గబ్బి, రాం కపూర్ తదితరులు
దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వాని
నిర్మాతలు: విక్రమాదిత్య మోత్వాని, మౌనిక్ సేన్
రచన, స్క్రీన్ ప్లే: అతుల్ సభర్వాల్
మ్యూజిక్: అమిత్ త్రివేది
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అలోక్‌నంద దాస్‌గుప్తా
సినిమాటోగ్రఫి: ప్రతీక్ షా
ఎడిటర్: ఆర్తీ బజాజ్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: 2023-04-07
జూబ్లీ వెబ్ సిరీస్ కథ: బాంబేలో రాయ్ టాకీస్ స్టూడియో అధినేత శ్రీకాంత్ రాయ్ (ప్రొసేన్‌జిత్ చటర్జీ) సంఘర్ష్ అనే సినిమాను భారీ ఎత్తున్న నిర్మించాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆ సినిమా కోసం మదన్ కుమార్ అనే హీరో పాత్ర కోసం జంషెడ్ ఖాన్ (నందీష్ సింగ్ సంధూ)ను ఎంపిక చేస్తాడు. జంషెడ్ ఖాన్‌తో శ్రీకాంత్ రాయ్ భార్య, స్టార్ హీరోయిన్ సుమిత్రా కుమారి (అదితి రావు హైదరీ) ప్రేమలో పడుతుంది.

జంషెడ్ ఖాన్‌తో ఉన్న సౌమిత్రాతోపాటు అతడిని ముంబై తీసుకురావాలని తన సహాయకుడు బినోద్ దాస్ (అపర్‌శక్తి ఖురానా)కు పని అప్పగిస్తాడు. అయితే మదన్ కుమార్ పాత్ర కోసం ఆశపడిన బినోద్ దాస్ జంషెడ్ ఖాన్‌పై ఓ కుట్ర పన్నుతాడు?
జూబ్లీ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు: తన బాస్ అప్పగించిన పనికి విరుద్ధంగా బినోద్ దాస్ ఏం చేశాడు? జంషెడ్ ఖాన్‌పై ఎలాంటి కుట్రను అమలు చేశాడు? జంషెడ్ ఖాన్‌ను ముంబైకి తీసుకొచ్చాడా? భారత్, పాకిస్థాన్ విడిపోయే సమయంలో ఇండియాకు వచ్చిన జయ్ ఖాన్నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
మదన్ కుమార్ పాత్రను చేజిక్కించుకోవడానికి బినోద్ దాస్ ఎలాంటి పనులకు పాల్పడ్డాడు? బినోద్ దాస్‌తో నటించడానికి సుమిత్రా అంగీకరించిందా? సంఘర్ష్ సినిమాను నిర్మించడానికి శ్రీకాంత్ రాయ్ ఎలాంటి అవరోధాలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే జూబ్లీ (Jubilee) వెబ్ సిరీస్ కథ.
జూబ్లీ వెబ్ సిరీస్ బ్యాక్ డ్రాప్: జూబ్లీ (Jubilee) సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే పృథ్వీరాజ్ కుమార్, అశోక్ కుమార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖుల జీవితాలు, అప్పటి సంఘటనల ఆధారంగా నిర్మించారనే విషయం స్పష్టమవుతుంది. భారత్, పాక్ విభజన నాటి పరిస్థితులను చక్కగా తెరమీద ఆవిష్కరించారు.
కాందీశీకులు అవస్థలు, సినిమా పరిశ్రమలోని రాజకీయాలు, కుట్రలు, జీవిన అస్థిత్వ పోరాటాల గురించి ఎమోషనల్‌గా చెప్పేందుకు ప్రయత్నించారు. దేశ విభజన సమయంలో అలర్లు, వాటి ప్రభావం ప్రజల మీద ఎలా పడ్డాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చూపించారు.

జూబ్లీ ఎలా సాగిందంటే: స్వాతంత్రం అనంతరం దేశ విభజన సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా సంఘర్ష్ అనే సినిమా కోసం ఓ స్టూడియో అధినేత అవస్థలు, సొంత భార్య సుమిత్ర మరో నటుడితో అక్రమ సంబంధం లాంటి అంశాలు సినిమాకు కీలకమైన ముడిసరుకుగా మారుతాయి. ప్రియుడి జంషెడ్ ఖాన్ కోసం సుమిత్రా భర్తనే ఎదురించడానికి సిద్దపడే సీన్లు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. అండర్ డాగ్‌గా బినోద్ దాస్ క్యారెక్టర్‌లో ఉండే షేడ్స్ సిరీస్‌ను చూసేందుకు ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది.
అదితిరావు హైదరీ, ఇతర నటీనటుల గురించి: జూబ్లీ (Jubilee) సీజన్ 1 లో అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి స్టార్ హీరోగా మారే బినోద్ దాస్ క్యారెక్టర్‌లో అపర్‌శక్తి ఖురానా అద్బుతంగా హావభావాలు పలికించడమే కాకుండా సాఫ్ట్ విలన్‌గా డిఫరెంట్ బాడీలాంగ్వేజ్‌తో ఆకట్టుకొంటాడు. పలు రకాలు షేడ్స్ ఉన్న సుమిత్ర పాత్రలో అదితిరావు హైదరీ మరోసారి పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు. కళ్లతో ఆమె పలికించిన ఫెర్ఫార్మెన్స్ ఎవరైనా ఫిదా కావాల్సిందే. జై ఖన్నా పాత్రలో సిద్దాంత్ గుప్తా, ఐటెమ్ గర్ల్ నిలోఫర్ ఖురేషి పాత్రలో వమికా గబ్బా ఆకట్టుకొంటారు.

సాంకేతిక అంశాల గురించి: జూబ్లీ (Jubilee) వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. 1940 నుంచి సాగే పిరియాడిక్ ఫిల్మ్. పిరియాడిక్ సినిమాకు కావాల్సిన హంగులు, వాతావరణాన్ని అద్బుతంగా క్రియేట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో ఒక డిఫరెంట్ టోన్‌లో సిరీస్‌కు ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించారు. ప్రతీక్ షా సినిమాటోగ్రఫి, అమిత్ త్రివేది మ్యూజిక్, అలోకానంద దాస్ గుప్తా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌కు బలంగా నిలిచాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గ్రేట్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా జూబ్లీ ఎలా ఉందంటే: భారత్ విభజన నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ జూబ్లీ (Jubilee). దాదాపు 10 సీజన్లుగా ఈ సిరీస్‌ను ప్లాన్ చేశారు. ఫస్ట్ సీజన్ ఏప్రిల్ 7 తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. రెండో సీజన్ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఎమోషన్స్, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సిరీస్. భారత దేశంలో సినిమా పరిశ్రమ చరిత్ర ఎలా మొదలైందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మంచి అనుభూతి కోసం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ను చూడొచ్చు.


Click it and Unblock the Notifications











