Kantara Movie OTT Release: సంచలనం సృష్టించిన కాంతార ఓటీటీ ప్లాన్ రెడీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

కన్నడ భాషలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా 100 కోట్లకు కలెక్షన్స్ అందుకుని అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని మొదట ఎవరు ఊహించలేదు. ఇక ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తున్న ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు రాబోతోంది అనే విషయంలో కూడా ఒక ప్లాన్ అయితే రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏ భాషలో ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

మొదట ఎవరు పట్టించుకోలేదు

మొదట ఎవరు పట్టించుకోలేదు

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన కాంతార సినిమాపై అసలు తెలుగులో అయితే మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ కన్నడ చిత్రపరిశ్రమలో ఆ సినిమా ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడంతో తెలుగులో డబ్ కాకముందే తెలుగు ఆడియోన్స్ కూడా సినిమాను చూడడం మొదలుపెట్టారు. ఇక నిర్మాత అల్లు అరవింద్ కాంతార సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

 బాక్సాఫీస్ హిట్

బాక్సాఫీస్ హిట్

ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక త్వరలోనే 200 కోట్లకు మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా ఒక వారం తర్వాత మిగతా భాషల్లో కూడా విడుదల అయింది. మొదట తెలుగులో కొన్ని లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేశారు. ఇంకా పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాత అల్లు అరవింద్ ఒక్కసారిగా థియేటర్ల సంఖ్యను అమాంతంగా పెంచేశారు.

ఓటీటీ హక్కులు ఆ సంస్థకు

ఓటీటీ హక్కులు ఆ సంస్థకు

ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంతార సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాను డైరెక్ట్ చేసిన విధానం అలాగే హీరోగా రిషబ్ శెట్టి నటించిన విధానం ఆడియెన్స్ అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

మొదట ఆ భాషలో స్ట్రీమింగ్

మొదట ఆ భాషలో స్ట్రీమింగ్

మొదట హాట్ స్టార్ కాంతార సినిమా ఓటీటీ హక్కుల కోసం పోటీ పడినప్పటికి అమెజాన్ ప్రైమ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక కన్నడ భాషల్లో హిట్టయిన తరువాత నవంబర్ మొదటి వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునే విధంగా ఆమెజాన్ డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ముందుగా కన్నడ భాషలోనే నవంబర్ 4న కాంతార స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

తెలుగులో ఎప్పుడంటే?

తెలుగులో ఎప్పుడంటే?

ఇక తెలుగులో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయింది కాబట్టి మరి కొంతకాలం ఎదురు చూడాలని నిర్మాతలు కోరడంతో అమెజాన్ ప్రైమ్ డీల్ లో కొంత మార్పులు చేసి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక నవంబర్ రెండవ వారంలోనే తెలుగు తమిళం అలాగే ఇతర భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X