Kantara OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంతార.. లేట్ అవడానికి కారణమిదే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీ నుంచి ఎన్నో ప్రయోగాత్మక కథలతో సినిమాలు రూపొందుతోన్నాయి. వీటికి అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ తరహాలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. దీంతో అలాంటికి మరింత ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతోన్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'కాంతార'. కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఈ సినిమాను గ్రామ దేవతల కాన్సెప్టుతో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కాంతార' మూవీ ముందుగా కన్నడంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో దీన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
అలా దాదాపు నాలుగు వారాల పాటు ఈ సినిమా తెలుగులో వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇక్కడ దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. అలాగే, ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 400 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇండియాలోనే ఎక్కువ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో చేరింది.

థియేటర్లలో దాదాపు నెలన్నర రోజుల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన 'కాంతార' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, డిమాండ్ వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ఆలస్యం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. దీన్ని నేటి (నవంబర్ 24వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో థియేటర్లలో మాదిరిగానే అమెజాన్‌లో కూడా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











