OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్.. డోంట్ మిస్!

ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి. అలా ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదేంటో కాదు.. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అపరేషన్ అలమేలమ్మ మూవీ. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సైతాన్ నటుడు రిషి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా కథేంటి.. ఎందులో చూడాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జెర్సీ సినిమాతో అందరి చూపును ఆకర్షించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఆ తర్వాత జోడి, శ్రీకృష్ణ అండ్‌ హిజ్‌ లీల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఈ సినిమాలే కాకుండా విక్రమ్ వేద అనే సినిమాలో మాధవన్ కు జోడిగా నటించి.. తమిళ ప్రేక్షకులను కూడా అలరించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది శ్రద్ధా శ్రీనాథ్.

Rishi and Shraddha Srinadh Operation Alemelamma Movie Streaming Now on Aha OTT

ఇక శ్రధ్ధా శ్రీనాద్ ఓటీటీల్లోనూ సినిమాలు సిరీసులు చేస్తూ.. ఆకట్టుకుంటుంది. అంతే కాదు... విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ సినిమాలో కూడా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ సినిమా ఆపరేషన్‌ అలమేలమ్మ. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. అయితే అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగానే వసూళ్లు సాధించింది.

ఇక ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ కు జోడీగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి హీరోగా నటించాడు. ఇప్పుడు ఆపరేషన్ అలమేలమ్మ సినిమా ఓటీటీలోకి వచ్చి సెన్సేషన్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఉంది. ఇక మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆపరేషన్‌ అలమేలమ్మ బెస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌ అంటూ ఇప్పటికే ఆహా కితాబు ఇచ్చింది. ఇక ఈ సినిమా ఆహా ఓటీటీ దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాను సునీల్‌ దర్శకత్వం వహించారు. రాజేష్‌ నటరంగ, అరుణ్‌ బాలాజీ, షీలమ్‌, విశ్వవిజేత్‌, ధీరజ్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ సినిమాస్‌ స్టార్‌ ఫ్యాబ్‌ బానర్‌ పై అమ్రేజ్‌ సూర్యవంశీ సునీల్‌ నిర్మతగా వ్యవహారించారు. జుధాహ్‌ సంధీ మ్యూజిక్ అందించారు కథ బాగుండడంతో కేజీఎఫ్‌ ఫేమ్‌ హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసింది.

ఇక అపరేషన్ అలమేలమ్మ సినిమా కథ విషయానికొస్తే.. డ‌బ్బుపై మోజుతో ప‌ర‌మేష్ అనే అనాథ యువ‌కుడు ఒక బిజినెస్‌ మెన్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. అయితే ఇదే అతనిని సమస్యలు తెచ్చిపెడుతుంది. మరి కిడ్నాప్‌ వ్యవహారంతో పరమేష్‌ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి... కిడ్నాప్‌ డ్రామాతో అనన్య అనే స్కూల్‌ టీచర్‌ కు సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఆపరేషన్‌ అలమేలమ్మ సినిమాచూడాలి. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. మీరు కనుక ఈ సినిమాను మిస్ అయితే ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X