OTTలో భయపెడుతున్న తెలుగు దెయ్యం సినిమా... ఎందులో చూడాలంటే?
క్రైమ్, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ఆ కోవకు చెందిన సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్ తీసుకువస్తున్నారు. డైరెక్టుగా ఓటీటీలోనే కొత్త కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ముఖ్యంగా భయపెట్టే సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే తెలుగు ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను భయపెట్టేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
ఓటీటీలో భయపెట్టే హార్రర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై క్రైమ్, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే తెలుగులో మసూద, విరూపాక్షి, పొలిమేర 1, 2, మంగళవారం, పిండం.. ఇలా భయపెట్టిన హార్రర్ సినిమాలకు ఓటీటీలో రికార్డ్ వ్యూస్ దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కోవలో ఓటీటీ ఆడియెన్స్ ను భయటపెట్టేందుకు మరొక హారర్ సినిమా వచ్చేసింది.

గురు సినిమా హీరోయిన్ రితికా సింగ్ నటించిన వళరి చిత్రం డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. మ్రితికా సంతోషి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే మిత్రికా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. హీరో శ్రీరామ్ ఇటీవలే పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు వళరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వళరి సినిమా ఇప్పటికే టీజర్స్, ట్రైలర్ తోనే భయపెట్టింది.
ఇప్పుడు రితికా సింగ్, శ్రీరామ్ నటించిన వళరి సినిమా డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. బుధవారం (మార్చి6) అర్ధ రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో వళరి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ హార్రర్ సినిమా స్ట్రీమింగ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. వళరి సినిమాలో రితికా సింగ్, శ్రీరామ్ హీరో హీరోయిన్లుగా నటించగా... సుబ్బరాజు, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రల్లో నటింటారు. ప్రతి ఒక్కరి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. వెంకటాపురం బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊళ్లో వాళ్లంతా అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో శ్రీరామ్ తన భార్య రితికా సింగ్ తో కలసి ఆ ఇంట్లోకి కుటుంబంతో సహా దిగుతాడు. అప్పటి నుంచి ఓ పదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు(రితికా సింగ్) తరచూ కల వస్తుంది. అదే సమయంలో దివ్యకు యాక్సిడెంట్ అవ్వగా.. బంగ్లాలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఊహించని పరిస్థితులు కలుగుతాయి. మరి బంగ్లాకు, దివ్యకు ఏంటి సంబంధం? అసలు ఆ బంగ్లా ఎవరిది? అన్నదే వళరి సినిమా కథ.
ఇక ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కింది. ప్రతి సీన్ భయపెట్టేలా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టడంలో ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకోల్పింది. ఇక ఓ మంచి హారర్ సినిమాను మీరు ఈ వీకెండ్ కు చూడాలనుకుంటే ఈ వళరిని ఈటీవీ విన్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











