OTTలోకి డైరెక్ట్‌గా మరో హారర్ మూవీ... మీరు ఈ సినిమాను చూసే ధైర్యం చేయగలరా?
ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తునే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనకు నచ్చుతాయి. ఈ మధ్య రొటిన్ కు భిన్నంగా ఓటీటీ సంస్థలు కూడా కొత్త కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కంటెంట్ సినిమాలు, సిరీసులు తీసుకువస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మరో హార్రర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇందులో గురు ఫేమ్ హీరోయిన్ రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది.. దాని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
హీరోయిన్ రితికా సింగ్ అనగానే తెలుగులో వెంకటేష్ గురు చిత్రం గుర్తుకు వస్తుంది. అందులో తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, అమాయకపు చూపులతో అందరి మనసును దోచేసింది. రితికా సింగ్ హీరోయినే కాదు.. ఆమె మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా. రితికా సింగ్ 2009లో భారత దేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్నదే విషయం చాలా మందికి తెలియదు. ఇక తనకు యాక్టిగ్ మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

రితికా 2012లో 'ఇరుదచుట్రు' అనే చిత్రంతోనే తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలోనే మాధవన్ హీరోగా నటించగా.. రితికా ఇందులో బాక్సింగ్ చాంపియన్ గా కనిపించింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేషన్ గురు పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక తెలుగులోనూ ఇదే భామను తీసుకున్నారు. బాక్సర్ పాత్రలో రితికా అభినయానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి.. స్వతహాగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సర్ కావడంతో ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసింది రితికా.
గురు చిత్రం తర్వాత పలు కోలీవుడ్ చిత్రాలు, తెలుగు చిత్రాలు చేసింది. చివరగా విజయ్ ఆంటోనీ హత్య సినిమాలో మెరిసింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు రితికా ఓ హర్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుదంి. రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ చిత్రమే 'వళరి'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
వళరి చిత్రం డైరెక్టుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ హారర్ మూవీలో రితికా సింగ్ తో పాటు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కెప్టెన్ నవీన్ నాయుడుగా కనిపించనున్నరని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీరామ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విడుదల చేసిన వళరి నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో రితికా దీనంగా పడుకొని ఉంది. వెనక వైపు జుట్టు విరబోసుకున్న ఓ బాలిక నిలబడి ఉందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక రితికా సింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ 'వేట్టైయాన్'లో నటిస్తుంది. ఓ యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నదని సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











