OTTలోకి భయానక క్షణాలను గుర్తుచేసే రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి మరో కొత్త సిరీస్ రాబోతుంది. ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా మరో కొత్త స్టోరీతో ప్రేక్షకులను సిద్ధం అయింది. అది కూడా రియల్ స్టోరీ. ఎవరిదో ఒకరి బయోపిక్ అనుకుంటే పొరపాటే. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఆ భయానక క్షణాలను గుర్తు చేసేందుకు సీరిస్ రూపంలో రాబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రేక్షకులు కథ బాగుంటే ఆదరిస్తారనే విషయం తెలిసిందే. వారికి రొటిన్ సినిమాల కంటే.. ఇటీవల థ్రిల్లర్స్ ను ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం కొత్త జోనర్స్ లో కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది. భోపాల్ లో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఓ రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. అదే ది రైల్వె మెన్ సిరీస్.

యావత్ దేశాన్ని కుదిపేసిన భోపాల్ గ్యాస్ లీక్ ఘన ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సీరిస్... ది రైల్వే మెన్. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక ది రైల్వే మెన్ సిరీస్ లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో నటించారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్ గా కనిపించనున్నారు. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్ గా, బాబిల్ లోకో పైలట్ గా పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి నలుగురూ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నారని ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
ఇక ఈ సీరిస్ దీపావళి కానుకగా.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 18వ తేదీ నుంచి.. స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సీరిస్ కు శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. ఆయన మొదటి సీరిస్ అది. ఇక ఆయుష్ గుప్తా కథను అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీసును 2021లో ప్రకటించగా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించింది.

ఇక ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే... 1984లో, డిసెంబర్ 2-3 రాత్రి, భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విష వాయువు లీక్ అయి తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. ఈ ప్రమాదంలో దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఈ విష వాయువు ప్రభావాలను అనుభవిస్తున్నాయి. ఇలాంటి రియల్ స్టోరీ మీరు చూడాలనుకుంటే నవంబర్ 18వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.


Click it and Unblock the Notifications











