Indian Police Force ఓటీటీ రంగంలోకి రోహిత్ శెట్టి.. పవర్‌ఫుల్ పోలీస్ స్టోరితో వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమలో ఓటీటీల హవా కొనసాగుతున్నది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ప్రేక్షకులు పోటెత్తుతుండటంతో వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్స్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా ఓటీటీ ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ దర్శక, నిర్మాత రోహిత్ శెట్టి, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో చేతులు కలిపారు. వీరి కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ పోలీస్ స్టోరి తెరపైకి రాబోతున్నది. ఈ వెబ్ సిరీస్‌కు ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భారీ వెబ్ సిరీస్‌తో దర్శకుడు రోహిత్ శెట్టి

భారీ వెబ్ సిరీస్‌తో దర్శకుడు రోహిత్ శెట్టి

ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‌తో దర్శకుడు రోహిత్ శెట్టి డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి తాను రూపొందించే తొలి వెబ్ సిరీస్ గురించి అభిమానులకు థ్రిల్లింగ్ కలిగించే ప్రకటన చేశారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో స్పెషల్ సెల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాంపైకి రావడం సిద్దార్థ్‌కు ఇదే మొదటిసారి. ఈ వెబ్ సిరీస్ ఎనిమిది భాగాలుగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఢిల్లీ పోలీస్ ఫోర్స్ నేపథ్యంగా

ఢిల్లీ పోలీస్ ఫోర్స్ నేపథ్యంగా

ఇండియన్ పోలీస్ ఫోర్స్ ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీస్ విభాగం నేపథ్యంగా కథను సిద్దం చేశారు. రోహిత్ శెట్టి తనదైన శైలిలో టీజర్‌లో ఎంట్రీ ఇచ్చారు. తుపాకులు, గన్స్‌, వాకీ టాకీలతో ట్రైలర్ ఇంటెన్స్‌గా కనిపించింది. రోహిత్ శెట్టి గన్ పేల్చుతూ తనదైన శైలిలో ఈ వెబ్ సిరీస్‌ను ప్రారంభించాడు. ఇక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సిద్దార్థ్ మల్హోత్రా హట్‌గా కనిపించారు. ఈ ట్రైలర్ భారీ అంచనాలు పెంచే విధంగా ఉందనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నది.

రోహిత్ శెట్టి పవర్‌ఫుల్ కథతో

రోహిత్ శెట్టి పవర్‌ఫుల్ కథతో

ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‌ గురించి రోహిత్ శెట్టి మాట్లాడుతూ.. ఇండియన్ పోలీస్ ఫోర్స్ అంటే నాకు అమితమైన గౌరవం. అందుకే నా సినిమాలు ఎక్కువగా పోలీస్ కథలతో రూపొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనిభాషల ప్రేక్షకులకు చేరువ కావడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోతో జతకట్టాను. అద్బుతమైన టాలెంట్ ఉన్న సిద్దార్థ్ మల్హోత్రా కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఓటీటీలో మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావం ఉంది అంటూ రోహిత్ శెట్టి పేర్కొన్నారు.

పోలీస్ కథలతో రోహిత్ శెట్టి హిట్స్

పోలీస్ కథలతో రోహిత్ శెట్టి హిట్స్

రోహిత్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే... 2021 దీపావళీ పండుగ నేపథ్యంలో అక్షయ్ కుమార్‌ నటించిన సూర్యవంశీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో పోలీస్ కథానేపథ్యంగా సింబా, సింగం చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. పోలీస్ కథలతో భారీ హిట్లను తన ఖాతాలో వేసుకొన్నారు.

షేర్షాగా సిద్దార్థ్ మల్హోత్రా

సిద్దార్థ్ మల్హోత్రా కెరీర్ విషయానికి వస్తే.. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన షేర్షా చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నారు. మిషన్ మజ్ను, థ్యాంక్ గాడ్, యోధా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X