నేరుగా OTTలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలంటే అక్కడ చూసేయండి!

రోజురోజుకూ ఓటీటీల హవా పెరిగిపోతుంది. అదిరిపోయే కామెడీ, హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీల వేదికగా వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రియులు కూడా ఎండలకు బయట తిరగకుండా.. ఇంట్లోనే ఉంటూ హాయిగా అదిరిపోయే చిత్రాలను చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే అన్నట్లుగా ఓ అదిరిపోయే రొమాంటిక్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, వసంత్ రవి, దీప శంకర్, సచ్చులు ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రమే పొన్ ఒండ్రుమ్ కండేన్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రియ డైరెక్ట్ చేశారు. జియో స్డూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండేలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి భగత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. అలాగే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా.. స్పీడ్ మోహన్ స్టంట్ కొరియాగ్రాఫర్ గా పని చేశారు. సతీష్ కృష్ణన్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా, జాఫ్రాన్ నిజార్ కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు చూసున్నారు.

Romantic Comedy Movie Pon Ondru Kanden Directly Released on OTT Check Details

ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. పలు కారణాల వల్ల నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. అదిరిపోయే రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమా దక్కించుకుంది. దక్కించుకోవడం మాత్రమమే కాదండోయ్.. ఈ చిత్రాన్ని ఈరోజు నుంచే అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచే జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అద్భుతమైన కామెడీతో అందరూ కడుపుబ్బా నవ్వాలనుకుంటే కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.

Romantic Comedy Movie Pon Ondru Kanden Directly Released on OTT Check Details

ఇదిలా ఉండగా.. ఈ సినిమా శాటిలైట్ హక్కులను కలర్స్ తమిళం దక్కించుకుంది. కానీ టీవీల్లో ఎప్పుడు ప్రసారం చేయనున్నారు, ఎన్ని రోజుల తర్వాత నుంచి ప్రసారం చేయనున్నారనే సమాచారం మాత్రం రాలేదు. కానీ జియో సినిమానే ఎక్స్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వివరించింది. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే అంటే అనుకున్న సమయానికే ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల అయింది. ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లి ఈ సినిమాను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X