Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇండియాలోనే టాప్ ప్లేస్‌కు RRR: ఏకంగా 46 మిలియన్స్‌తో సరికొత్త చరిత్ర
'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతటి భారీ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. పిరియాడిక్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరు బడా హీరోలు కలిసి నటించడంతో పాటు భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది.
స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే రూపొందినా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. దీంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా ఇది వంద కోట్లకు పైగానే లాభాలను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా హాళ్లలో సందడి చేసిన RRR.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసుకుంది.
థియేటర్లలో మాదిరిగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో కూడా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించిందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సినిమా హవాను చూపిస్తోంది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. ఇండియాతో సమానంగా విదేశాల్లోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!
నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచంలోని సినీ ప్రియులకు చేరువైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. తాజాగా మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైన నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఇప్పటి వరకూ 46 మిలియన్ల స్ట్రీమింగ్ గంటలను (Hours) పూర్తి చేసుకుంది. తద్వారా గ్లోబల్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన నాన్ ఇంగ్లీష్ మూవీగానూ ఇది ఘనతను అందుకుంది. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించిన ఏకైక ఇండియన్ మూవీగా ఇది నిలిచింది. అలాగే, ఇండియాలోనూ ఎక్కువ స్ట్రీమింగ్ గంటలను పూర్తి చేసుకున్న మూవీగా చరిత్రను సృష్టించింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇక, ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవేన్సన్, అలీసన్ డూడీ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.