RRR మూవీ మరో సంచలనం: 190 దేశాల్లో 1000 మిలియన్స్‌తో కనీవినీ ఎరుగని రికార్డు

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రకటన సమయం నుంచి ప్రత్యేకతను చాటుకుని ప్రతిష్టాత్మకమైన సినిమాలుగా పేరు తెచ్చుకుంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. ఈ చిత్రంలో టాలీవుడ్‌లోనే స్టార్లుగా వెలుగొందుతోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఆరంభంలోనే దీని రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. అదే సమయంలో ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు, అంచనాలకు అనుగుణంగానే భారీ స్థాయిలో విడుదలైంది. ఆ తర్వాత ప్రేక్షకుల స్పందనను అందుకుని భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది.

విడుదలకు ముందే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ మూవీ థియేట్రికల్ హక్కులు అన్ని ఏరియాల్లోనూ భారీ ధరకు అమ్ముడుపోయాయి. అలాగే, ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇక, ఈ సినిమాకు సంబంధించిన అన్ని వెర్షన్ల స్ట్రీమింగ్‌ మే 20వ తేదీ నుంచి ప్రారంభం అయింది.

RRR Gets 1000 Million Streaming Minutes in ZEE5

ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని 'పే ఫర్ వ్యూ' (డబ్బులు చెల్లించి చూసేలా) పద్దతిన స్ట్రీమింగ్ చేయాలని జీ5 సంస్థ నిర్ణయించుకుంది. అయితే, దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. అందుకు అనుగుణంగానే సబ్‌స్కైబర్లకు ఉచితంగా ఈ సినిమాను చూసే అవకాశాన్ని కల్పించింది. ఇక, ఈ ఓటీటీలో అన్ని భాషల వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే కోటి స్ట్రీమింగ్ మినిట్స్‌ను కూడా దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అలాగే, చాలా రోజులుగా ట్రెండింగ్‌లోనూ కొనసాగుతోంది.

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ జీ5 తాజాగా మరో కొన్ని గొప్ప రికార్డులను నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమా 1000 మిలియన్స్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుంది. తద్వారా జీ5లో ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది రికార్డును క్రియేట్ చేసింది. అదే సమయంలో ఏకంగా 190 దేశాల్లో స్ట్రీమింగ్ అయిన ఏకైక ఇండియన్ మూవీగానూ సరికొత్త చరిత్రను సృష్టించింది. అంతేకాదు, మే 20 నుంచి ఈ సినిమా నెంబర్ వన్ ప్లేస్‌లోనే ట్రెండింగ్ అవుతోంది. ఇలా చాలా రోజుల పాటు ట్రెండ్ అయిన సినిమాగానూ RRR మరో ఘనతను అందుకుంది. ఇలా జీ5లో ఈ సినిమా సంచలనం అవుతోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X