twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR మూవీ 10 వారాల రికార్డు.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా ఘనత

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా కొన్ని నెలల క్రితం వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ను ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీనికితోడు భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!

    టాలీవుడ్‌లో రూపొందినా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఇది వంద కోట్లకు పైగానే లాభాలను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని అందుకుంది. ఇక, థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన RRR.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దక్షిణాది భాషల డిజిటల్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. అలాగే, హిందీ వెర్షన్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది.

    RRR Movie Continues 10 Weeks Trending in Netflix

    సినిమా హాళ్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా.. అప్పటి నుంచి హవాను చూపిస్తోంది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఇండియాతో సమానంగా విదేశాల్లోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ సొంతమైంది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా ఇండియాలోనే ఫస్ట్ మూవీగా నిలిచింది.

    బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీబిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీ

    నెట్‌ఫ్లిక్స్ సంస్థ ద్వారా ప్రపంచంలోని సినీ ప్రియులు అందరికీ చేరువైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. తాజాగా మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలై పది వారాలను పూర్తి చేసుకుంది. తాజా వారంలో తొమ్మిదో స్థానంలో ట్రెండింగ్ అయిన ఈ సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌‌లో వరుసగా పది వారాల పాటు టాప్ 10లో ట్రెండింగ్ అయింది. తద్వారా ఈ సంస్థ చరిత్రలో ఈ ఘనతను అందుకున్న ఏకైక ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ రేర్ ఫీట్ సాధించిన మొట్టమొదటి నాన్ ఇంగ్లీష్ మూవీగానూ ఇది రికార్డును నమోదు చేసుకుంది.

    RRR Movie Continues 10 Weeks Trending in Netflix

    తారక్, చరణ్ కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇక, ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవేన్‌సన్, అలీసన్ డూడీ తదితరులు ముఖ్యమైన పాత్రలు చేశారు.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now This Movie Completes 10 Weeks Trending in Netflix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X