twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Netflix లో చరిత్ర సృష్టించిన RRR.. ఓటీటీలో రికార్డుల వెల్లువ.. 50 దేశాల్లో టాప్ రేపుతూ..

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం హాలీవుడ్ ప్రముఖుల చేతే కాకుండా అమెరికా మీడియా ప్రశంసలు అందుకొంటున్నది. ఇప్పటికే ఈ సినిమాపై హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. RRR చిత్రంపై యూఎస్ మీడియా కురిపించిన ప్రశంసలు, నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా సాధించిన రేటింగ్ విషయంలోకి వెళితే..

    హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా

    హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా

    అమెరికాలో RRR చిత్ర ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ది బ్యాట్‌మెన్, టాప్ గన్ మావెరిక్, ది ఫాలౌట్ లాంటి చిత్రాలకు ధీటుగా ప్రశంసలు, కలెక్షన్లను అందుకొన్నది. అమెరికాలో తాజాగా ప్రకటించిన 2022లో టాప్ 10 చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకొన్నది.

    2022లో బెస్ట్ మూవీగా

    2022లో బెస్ట్ మూవీగా

    బ్రిటీష్ పాలన నేపథ్యంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ఫిక్షన్ పాత్రల కథతో వచ్చిన
    RRR చిత్రాన్ని అమెరికా మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. 2022లో అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా తప్పక చూడాల్సిన చిత్రంగా పేర్కొన్నది. 2022 విడుదలైన చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొన్నది.

    నెట్ ఫ్లిక్స్‌లో సునామీ..

    నెట్ ఫ్లిక్స్‌లో సునామీ..

    ఇదిలా ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో RRR చిత్రం దుమ్మురేపుతున్నది. అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా RRR ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఇప్పటి వరకు విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

    5.23 మిలియన్ల వీక్షకులు

    5.23 మిలియన్ల వీక్షకులు

    నెట్‌ఫ్లిక్‌లో జూన్ 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రేక్షకులు ఎక్కువ మంది RRR సినిమానే చూశారు. దాదాపు 5.23 మిలియన్ల మంది అంటే దాదాపు 52 లక్షల మంది ఈ సినిమాను చూశారు. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ రేటింగ్‌ను RRR మూవీ సాధించింది అని గణాంకాలను విడుదల చేశారు.

    గత 24 రోజుల్లో 4.4 కోట్ల మంది

    గత 24 రోజుల్లో 4.4 కోట్ల మంది

    RRR చిత్రం ఓటీటీలో రిలీజైనప్పటి నుంచి అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌పై ప్రేక్షకులు భారీగా ఆదరించారనేది తాజా గణాంకాలు వెల్లడి అవుతున్నాయి. గత 24 రోజుల్లో ఈ సినిమాను 44.71 మిలియన్ల మంది అంటే.. 4.4 కోట్ల మంది వీక్షించినట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఈ వ్యూవర్ షిప్ మరింతగా. భారీగా పెరిగే అవకాశం ఉందని నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు వెల్లడించారు.

     54 దేశాల్లో టాప్ 10 స్థానంలో

    54 దేశాల్లో టాప్ 10 స్థానంలో

    ఇదిలా ఉండగా, RRR చిత్రం 54 దేశాల్లో టాప్ 10 స్థానాల్లో చోటు దక్కించుకొన్నది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో పాకిస్థాన్, బెహ్రయిన్, ఖతార్, శ్రీలంక, సౌదీ అరేబియా దేశాల్లో విశేషంగా ఆదరణను దక్కించుకొంటున్నది. బంగ్లాదేశ్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌పై నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది.

    ప్రపంచవ్యాప్తంగా RRR కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా RRR కలెక్షన్లు

    ఇదిలా ఉండగా, RRR చిత్రం థియేట్రికల్ రిలీజ్ రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పలు ప్రాంతాల్లో ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను సాధిస్తున్నది. ఇక ముందు ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    RRR movie getting good feedback from Hollywood media. It got good response on Netflix and other OTT platforms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X