twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే..

    |

    ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సంచలన రీతిలో వసూళ్లను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం ఐదో వారంలోకి ప్రవేశించి ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతున్నది. ఇంకా హిందీ మార్కెట్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్రభావవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఇక థియేట్రికల్ రన్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే RRR మూవీ వసూళ్లు గురించి, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

    RRR మూవీకి కేజీఎఫ్2 అడ్డుకట్ట

    RRR మూవీకి కేజీఎఫ్2 అడ్డుకట్ట

    RRR బాక్సాఫీస్ జోరుగా సాగుతున్న సమయంలో KGF Chapter 2 చిత్రం రిలీజైంది. దీంతో RRR సినిమా వసూళ్ల ప్రవాహానికి కేజీఎఫ్2 అడ్డుకట్ట వేసింది. దాంతో RRR సినిమా వసూళ్లు మందగించాయి. అయితే కేజీఎఫ్2 సినిమా ప్రభంజనాన్ని తట్టుకొని థియేటర్లలో RRR చిత్రం నిలబడటమే కాకుండా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది.

    5వ వారంలో 1100 కోట్లు

    5వ వారంలో 1100 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా 4 వారాల్లోనే 1000 కోట్లు సాధించిన RRR ఐదోవారంలో కూడా అదే ఊపును కొనసాగించింది. దాంతో 29వ రోజున ఈ చిత్రం 1100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో కేజీఎఫ్2 జైత్రయాత్ర కొనసాగడంతో థియేట్రికల్ రన్ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    నెట్‌ఫ్లిక్స్, జీ5లో RRR మూవీ

    నెట్‌ఫ్లిక్స్, జీ5లో RRR మూవీ

    RRR చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ రెండు ప్రధాన సంస్థలు చేజిక్కించుకొన్నాయి. హిందీ వెర్షన్ RRR ను ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లను జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి హక్కులను పొందింది. దాంతో ఈ రెండు వెర్షన్ల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తన్నారు.

    విదేశీ భాషల్లో RRR ఓటీటీ రిలీజ్

    విదేశీ భాషల్లో RRR ఓటీటీ రిలీజ్

    RRR విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటింటే.. ఈ సినిమా హిందీతోపాటు ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్నది. ఫారిన్ వెర్షన్లను కూడా Netflix ప్రసారం చేయడం విశేషంగా మారింది. బాహుబలి సినిమాకు వచ్చిన క్రేజ్‌తో RRR విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడటంతో విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం చేశారు.

    RRR ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

    RRR ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

    ఇక ఇలాంటి ప్రత్యేకతలు ఉండటంతో RRR మూవీకి ఓటీటీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను మే 25వ తేదీన గానీ, లేదా జూన్ తొలివారంలో గానీ స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఇక ఓటీటీలో కూడా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    RRR movie set to release on Netflix and Zee5 OTT. This movie may release on May 25th or June 1st week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X