RRR in OTT: వసూళ్లతో రచ్చ చేసి ఇక ఇంటికే వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడమే కాక విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ చేసింది. ఓటమే ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు బడా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపకం కారణంగా చాలా మంది సినిమా చూడలేదు. వారంతా సినిమా ఒటీటీలో ఎప్పుడు వస్తుందా? అని చూస్తున్నారు .ఇక ఆ సినిమా అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసింది .ఆ వివరాలు

ప్రతిష్టాత్మకంగా

ప్రతిష్టాత్మకంగా


నందమూరి వంశానికి చెందిన ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 450 కోట్లతో నిర్మించారు. అలాగే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

 451 కోట్ల బిజినెస్

451 కోట్ల బిజినెస్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని ఏరియాల బిజినెస్ చూస్తే రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీ రిలీజ్ డేట్

ఇక RRR సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా.. 2022 లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికీ పలు థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

మే 20న

మే 20న


RRR చిత్రాన్ని మే 20న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. భారీ రేటుకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హిందీ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Recommended Video

Sarkaru Vaari Paata Review మూవీ లో హైలైట్స్ ఇవే | Filmibeat Telugu
ఓటీటీలో కూడా

ఓటీటీలో కూడా

నిజానికి RRR చిత్రాన్ని జీ ఫ్లెక్స్ లో పే పర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు జీ5 ఓటీటీలో సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి నార్మల్ గానే చూసే అవకాశం కల్పిస్తోంది. ఇక థియేటర్లలో రేచ్ఛ చేసిన ఈ సినిమాలో ఓటీటీలో కూడా తన మార్క్ సృష్టించుకోనుంది అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X