RRR మూవీ ఖాతాలో వరల్డ్ రికార్డు: దేశం గర్వించేలా చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడంతో పాటు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలను కలిపి దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్‌గా తెరకెక్కించడమే. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అదే రీతిలో స్పందన దక్కింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓ వరల్డ్ రికార్డును నమోదు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

ఇద్దరు స్టార్లతో రాజమౌళి సందడి
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

రికార్డు బిజినెస్.. భారీగా విడుదల
ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న RRR మూవీ హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇది రికార్డు స్థాయిలో విడుదలైంది.

అన్ని కోట్లు కలెక్ట్ చేసిన సినిమా
RRR మూవీ ముగింపు సమయానికి నైజాంలో రూ. 111.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 51.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 36.40 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.31 కోట్లు, గుంటూరులో రూ. 18.21 కోట్లు, కృష్ణాలో రూ. 14.76 కోట్లు, నెల్లూరులో రూ. 10.50 కోట్లు, కర్నాటకలో రూ. 44.50 కోట్లు, తమిళనాడులో రూ. 38.90 కోట్లు, కేరళలో రూ. 11.05 కోట్లు, హిందీలో రూ. 134.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్లు షేర్, రూ. 1150.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

మూవీకి టార్గెట్... లాభం ఎంత?
భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 160.06 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ఓటీటీలో రిలీజ్... రెండింటిలో
RRR మూవీ థియేట్రికల్ హక్కుల మాదిరిగానే.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక, ఈ మూవీని మే 20 నుంచి ఆ ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో చరిత్ర సృష్టించేసి
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా మొదటి వారంలోనే ఈ సినిమా 1,83,60,000 స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది.

దేశంలో కాదు.. ప్రపంచంలోనే
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా ఇది వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసుకుంది. అంతేకాదు, గతంలో ఇండియా తరపున ఏ సినిమా కూడా ఈ మైలురాయిని చేరుకోలేదని తెలుస్తోంది. దీంతో RRR యూనిట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











