RRR: చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ఇండియాలో ఏ మూవీకి దక్కని రికార్డు ఇది

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే, అందులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న చిత్రాలు మాత్రలు చాలా అరుదుగానే ఉన్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందింన RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే భారీ కలెక్షన్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

పేరుకు తెలుగు సినిమానే అయినా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికాయి. అయినప్పటికీ అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అదే మాదిరిగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు ముట్టజెప్పినట్లు వార్తలు వచ్చాయి.

 RRR Trending Since 2 Weeks in 54 countries worldwide on Netflix

భారీ బడ్జెట్‌తో ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. థియేటర్లలో కంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాకు స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా మొదటి వారంలోనే ఈ సినిమా 1,83,60,000 స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా ఇది అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి వారంలో ఎక్కువ స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసుకున్న RRR (రౌద్రం రణం రుధిరం).. రెండో వారం కూడా 1.50 కోట్ల నిమిషాలకు పైగానే స్ట్రీమింగ్ అయినట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇది రెండు వారాలుగా ట్రెండింగ్ అవుతూనే ఉందని కూడా వెల్లడించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 8 దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోందట. అంతేకాదు, మరో 54 దేశాల్లో టాప్‌లో నిలిచినట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. ఇలా గతంలో ఇండియా నుంచి ఏ సినిమా కూడా ఇంత స్థాయిలో ఆదరణను దక్కించుకోలేదు. ఫలితంగా ఇది మరో ఘనతను సొంతం చేసుకున్నట్లు అయింది.

 RRR Trending Since 2 Weeks in 54 countries worldwide on Netflix

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X