twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR మూవీ మరో ఆల్‌టైం రికార్డు: ఏకంగా మూడు వారాల నుంచి టాప్‌లోనే!

    |

    తెలుగులో ఎన్నో జోనర్లలో రకరకాల సినిమాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. ఇందులో టాలీవుడ్‌లోనే స్టార్లుగా వెలుగొందుతోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోవడంతో పాటు ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు, అంచనాలకు అనుగుణంగానే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే భారీ కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ అయింది.

    షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!

    పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). అందుకే ఈ మూవీ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. అదే మాదిరిగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇక, అన్ని వెర్షన్ల స్ట్రీమింగ్‌ను మే 20వ తేదీ నుంచి మొదలు పెట్టారు.

    RRR Trending Worldwide since 3 weeks in ZEE5

    భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని 'పే ఫర్ వ్యూ' (డబ్బులు చెల్లించి చూసేలా) పద్దతిన అందుబాటులోకి తీసుకు రావాలని జీ5 సంస్థ నిర్ణయించుకుంది. అయితే, దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. అందుకు అనుగుణంగానే సబ్‌స్కైబర్లకు ఉచితంగా సర్వీస్‌ను కల్పించింది. ఇక, ఈ ఓటీటీలో అన్ని భాషల వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే కోటి స్ట్రీమింగ్ మినిట్స్‌ను కూడా దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.

    అందాల ఆరబోతలో హద్దు దాటిన అనన్య: వామ్మో ఆమెనిలా చూశారంటే!అందాల ఆరబోతలో హద్దు దాటిన అనన్య: వామ్మో ఆమెనిలా చూశారంటే!

    RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ జీ5 ఓటీటీలో మూడు వారాలుగా ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా సదరు సంస్థ ఓ అదిరిపోయే విషయాన్ని వెల్లడించింది. జీ5లో RRR మూవీ ఏకంగా మూడు వారాలుగా టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోందట. అది కూడా ఇండియా వైడ్‌గా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమానే టాప్‌లో కొనసాగుతుందట. దీంతో ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా RRR (రౌద్రం రణం రుధిరం) రికార్డు క్రియేట్ చేసుకున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది.

    టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now This Movie Trending Worldwide since 3 weeks in ZEE5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X