OTTలోకి వచ్చేసిన రూ.8 వేల కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద రూ.8వేల కోట్ల రూపాయలు సంపాదించిన కొత్త చిత్రం ఓటీటీలో సందడి చేస్తుంది. అదేంటో కాదు.. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి. భగవద్గీత శ్లోకాన్ని శృంగార సన్నీవేశాల్లో వాడారని భారతీయులు ఫైర్ అయ్యారు. అసలు ఈ సినిమా కథేంటి.. ఇందులో అంతగా ఏం ఉంది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హాలీవుడ్‌ లో ఇటీవల రిలీజ్ అయిన 'ఓపెన్‌ హైమర్‌' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్ హైమర్ తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Rs8 Thousand Crore Oppenheimer Telugu Version Movie Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

జూలై 21న థియేట‌ర్ల‌లో విడుద‌లైన బ‌యోగ్రాఫిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 100 మిలియన్‌ డాలర్లతో ఈ సినిమాను నిర్మించారు. దాదాపు ఈ సినిమా 950 మిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సిినిమా రూ.8వేల కోట్లును వసూళ్లు చేసింది. ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది హాలీవుడ్‌ లో మూడో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ సృష్టించింది.

Rs8 Thousand Crore Oppenheimer Telugu Version Movie Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

ఇక ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ప్రస్తుతానికి రెంట్‌ విభాగంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీక్షించాలంటే రూ.149 చెల్లించాల్సి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్‌ వీడియో తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్ట్ పెట్టింది.

ఇక ఈ సినిమాలో ఓ సంద‌ర్భంలో హీరో కొట్టిన డైలాగ్ అప్పట్లో వివాదాస్ప‌దంగా మారింది. శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని వాడ‌డంతో భారతీయులు ఫైర్ అయ్యారు. అయితే హీరోయిన్‌ తో ఉన్న శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో.. హీరో భ‌గ‌వద్గీత శ్లోకాన్ని చెప్పడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొంద‌రు ఆ సీన్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్‌కాట్ ఓపెన్‌హైమ‌ర్‌, రెస్పెక్ట్ హిందూక‌ల్చ‌ర్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ లు ట్రెండ్ అయ్యాయి.

Rs8 Thousand Crore Oppenheimer Telugu Version Movie Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... అణుబాంబును క‌నిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌ హైమ‌ర్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఓపెన్ హైమర్ మూవీని రూపొందించాడు. అణుబాంబును క‌నిపెట్ట‌డంలో ఓపెన్‌హైప‌ర్ ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌, అత‌డికి ఎదురైన రాజ‌కీయ ఒత్తిడుల‌ను ఈ సినిమాలో చూపించారు. మీరు ఈ సినిమాను థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X