OTTలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ... ఎక్కడ చూడాలంటే?

రొటిన్ సినిమాలు చూసి బోర్ కొట్టిందా.. అయితే మీకోసం ఓటీటీలోకి మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. మీకు థ్రిల్ కనిగించేందుకు ఓటీటీలో సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. చిలసౌ సినిమాలో పద్ధతిగా నటించిన రుహానీ శర్మ... ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హర్ - చాప్టర్ 1. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం చిలసౌ. ఇక ఈ చిత్రంలో సుశాంత్ సరసన రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ఈ భామను చూసి... ఇలాంటి అమ్మాయి భార్యగా కావాలంటూ అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుని వసూళ్లను రాబట్టింది.

Ruhani Sharma Investigative crime thriller Movie Her Chapter 1 Streaming Now on Amazon Prime Video OTT

ఇక తాజాగా రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ హర్ - చాప్టర్ 1. ఇక ఈ సినిమా జూలై 21వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ లభించింది. ఈ చిత్రంలో రుహానీ యాక్టింగ్ ఆకట్టుకున్నా.... థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమాకు కలిసిరాలేదని చెప్పాలి.

రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ హర్ చాప్టర్ 1... ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. సడెన్ గా ఈ చిత్రం ప్రముఖ ఓటిటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హర్ - చాప్టర్ 1 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍ అవుతోంది. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

Ruhani Sharma Investigative crime thriller Movie Her Chapter 1 Streaming Now on Amazon Prime Video OTT

హర్ చాప్టర్ 1 చిత్రంలో రుహానీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌ గా నటించారు. వికాశ్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, సంజయ్ స్వరూప్, బెనర్జీ కీలకపాత్రల్లో నటించారు. శ్రీధరర్ స్వరాగవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. డబుల్ అప్ మీడియాస్ పతాకంపై రఘు సంకురాత్రి, దీప ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటంతో మంచి బజ్ నెలకొన్నా... థియేటర్లలో ఆ స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు.

ఇప్పుడు హర్ చాప్టర్ 1 ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే... హైదరాబాద్ శివార్లలో రెండు హత్యలు జరుగుతాయి. ఆ కేసు విచారణను ఏసీపీ అర్చన ప్రసాద్ (రహానీ శర్మ) చేపడతారు. ఈ హత్యలు చేసింది ఎవరు? వారిని ఏసీపీ ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ చిత్రం కథ. ఈ చిత్రంలోని కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో మీరు గనుక మిస్ అయితే... ఓటీటీలో చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X