For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sunny Leone: బుల్లితెర కమెడియన్ తో సన్నీలియోన్.. షూటింగ్ సెట్ లో అసభ్యంగా.. ఎక్కడ చూస్తున్నావ్ అంటూ!

  |

  సన్నీ లియోన్ అంటే తెలియని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల ప్రేక్షకులు ఉండరు. శృంగార తారగా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల తెలుగులో ఓ సినిమా చేసింది బ్యూటిఫుల్ సన్ని లియోన్. అయితే ఆ సినిమా షూటింగ్ సెట్ లో సన్నీ లియోన్ పక్కన ఉండగా ఒక కమెడియన్ ఎలా ప్రవర్తించాడనే విషయం తాజాగా బయటకు వచ్చింది.

  ఆఫర్లు రావడంతో ముంబైకి..

  ఆఫర్లు రావడంతో ముంబైకి..

  అయితే పలు ఆర్థిక పరిస్థితుల కారణంగా సన్నీ లియోన్ పోర్న్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అడల్ట్ కంటెంట్ సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీలియోన్ ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు విదేశాల్లోనే కొన్నాళ్లు స్థిరపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడే ఉంటూ వరుసగా అవకాశాలు అందుకున్న సన్నీ లియోన్ ముందుగా గ్లామరస్ పాత్రలతోపాటు ఐటమ్ సాంగ్స్ లో అందాల విందు, అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది.

  హీరోయిన్ గా డెబ్యూ..

  హీరోయిన్ గా డెబ్యూ..

  ఇక 2011లో రాగిణి ఎంఎంఎస్ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది సన్నీ లియోన్. ఆ తర్వాత 2012లో వచ్చిన జిస్మ్ 2లో సూపర్ రొమాంటిక్ గా నటించి అట్రాక్ట్ చేసింది సన్నీ. జాక్ పాట్ సినిమాలో కూడా పర్వాలేదనిపించుకున్న స్టన్నింగ్ బ్యూటి సన్నీ లియోన్ బేబీ డాల్, పింక్ లిప్స్, చార్ బాటిల్ వోడ్కా, లైలా మే లైలా, డర్టీ గర్ల్ వంటి స్పెషల్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా సన్నీలియోన్ కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే.

  స్పెషల్ సాంగ్స్ తో క్రేజ్..

  స్పెషల్ సాంగ్స్ తో క్రేజ్..

  మంచు మనోజ్ కరెంటు తీగ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో టీచర్ గా నటించిన సన్నీలియోన్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందులో సన్నీ సన్నీ అనే పాటతో యూత్ ను ఊపేసింది. ఆ సినిమా తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ చిత్రంలో డియో డియో డిసక డిసక అనే ఐటెం సాంగ్ తో అలరించింది బ్యూటిఫుల్ సన్నీ. అప్పటినుంచి సన్నీ లియోన్ సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ తో బిజీగా మారిపోయింది.

  సద్దాం హుస్సేన్ ప్రవర్తన..

  సద్దాం హుస్సేన్ ప్రవర్తన..

  ఇక ఇటీవలే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో గ్లామర్ కే పరిమితం కాకుండా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సన్నీ లియోన్. ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇందులో మంచు విష్ణుకు స్నేహితుడి పాత్రలో బుల్లితెర కమెడియన్ సద్దాం హుస్సేన్ యాక్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సన్నీ లియోన్ పక్కన ఉండి మాట్లాడుతుంటే తన ప్రవర్తన ఎలా ఉండేదో తాజాగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలో చెప్పుకొచ్చాడు.

   సన్నీ లియోన్ తో సెల్ఫీ..

  సన్నీ లియోన్ తో సెల్ఫీ..

  ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ 10 ఎపిసోడ్స్ గా రానుండగా తాజాగా 9వ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో సన్నీ లియోన్ తో దిగిన ఫొటో, సెల్ఫీని చూపించాడు సద్దాం హుస్సేన్. దానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఆశ్చర్యంగా చూశాడు. "ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు ఇలా అద్దాలు (బ్లాక్) పెట్టేవాన్ని. కళ్లు మాత్రం" అంటూ పక్కకు చూస్తూ చేసి చూపించాడు సద్దాం.

  కింద ఏం చూస్తున్నావ్..

  సన్నీ లియోన్ తో సీన్ అన్నా.. అని చెప్పిన సద్దాం హుస్సేన్ సన్నీ లియోన్ డైలాగ్ చెబుతుంటే ఎలా చూసేవాడో చేసి చూపించాడు. ఇందులో సన్నీ లియోన్ క్యారెక్టర్ ను మరొక కమెడియన్ చేశాడు. అతను చంపేస్తా.. చంపేద్దాం అంటూ ఏదో డైలాగ్ చెబుతుంటే.. సద్దాం హుస్సేన్ మాత్రం అదోలా కిందకు చూశాడు. ఎక్కడ చూస్తున్నావ్.. పైన చూడు అంటూ అమాయకంగా అన్నాడు కమెడియన్. వన్ మోర్ టేక్ సర్ అని సద్దాం అంటే.. సద్దాం.. అంటూ కౌగింలుచుకున్నాడు కమెడియన్. ఈ స్కిట్ చేసేటప్పుడు నిజంగానే సన్నీ లియోన్ తో సద్దాం బిహేవ్ చేశాడన్నట్లుగా చూస్తూ నవ్వుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, యాంకర్ దీపిక పిల్లి.

  English summary
  Saddam Hussein Behaviour With Sunny Leone In Movie Shooting Skit In Comedy Stock Exchange Episode 9 Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X