1000 ఏళ్లకు ఓసారి భూమ్మిద ఏం జరుగుతుంది ? మిస్టీరియస్ థ్రిల్లర్‌ను ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
కరోనా కారణంగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. చాలా తక్కువ ధరకే ఏడాది మొత్తం ప్రపంచంలోని అన్ని భాషల సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ సహా ఇతర ఒరిజినల్ కంటెంట్ వీక్షించవచ్చు. ఫ్యామిలీతో సహా సినిమాకు వెళ్లలేని మధ్యతరగతి జీవులు ఓటీటీ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి రోజూ ఓటీటీలోకి చిన్నా పెద్దా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తాజాగా వచ్చేవారం ఓ మిస్టీరియస్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓటీటీలకు దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో మనదేశంలో ఈ రంగం రోజురోజుకు విస్తరిస్తోంది. దిగ్గజ సంస్థలతో పాటు అనేక కంపెనీలు ఓటీటీ రంగంలో దిగడంతో విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త సినిమాలు మార్కెట్‌లోకి వస్తే చాలు దాని కోసం కొట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ మూవీలు ఓటీటీలో బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. ప్రేక్షకుల ఆదరణ నేపథ్యంలో ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఓటీటీ కంపెనీలు.

తాజాగా తాజాగా ఓటీటీలో ఓ మిస్టీరియస్ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. మైథలాజికల్, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా పేరు ఐంధమ్ వేదమ్. అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్‌పై అభిరామి రామనాథన్, నల్లమై రామనాథన్ ఈ వెబ్‌సిరీస్ నిర్మించారు. దీనికి ఎల్ నాగరాజన్ దర్శకత్వం వహించారు. ఇందులో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించారు.
మక్కల్ సెల్వన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఐంధమ్ వేదమ్ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 1000 ఏళ్లకు ఒకసారి నవగ్రహాల్లోని బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, అంగారకుడు అనే నాలుగు గ్రహాలు సూర్యుడిని చూసేలా ఒకే వరుసలో ఉంటాయి. ఆ సమయంలో అద్భుతం జరుగుతుందని ట్రైలర్‌లో తెలిపారు. సస్పెన్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఊహాకందని ట్విస్టులతో దీనిని నింపేశారు.
హీరోయిన్ చేతికి ఓ పెట్టే ఇచ్చి అయ్యంగార్ పురం అనే గ్రామానికి పంపిస్తారు. అక్కడ ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఏంటీ..? ఐదో వేదం బయటికి వచ్చిందా? అఘోరాలు ఎవరి గురించి, దేని కోసం వెతుకుతున్నారు? గత జన్మలో హీరోయిన్ ఎవరు? అనేది తెలియాలంటే ఐంధమ్ వేదమ్ చూడాల్సిందే. ఈ మిస్టీరియస్ వెబ్ సిరీస్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. అక్టోబర్ 25 నుంచి తెలుగు, తమిళ భాషల్లో జీ5లో ఐంధమ్ వేదమ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











