Virupakash ఓటీటీ హక్కులు ఆ బడా సంస్థకే.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష. అయితే ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయ్ ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఇది. అందువల్లే ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ స్టోరీ కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకొని సినిమా చేయడం సాయి ధరమ్ తేజ్ కు బాగా కలిసొచ్చింది.
థియేటర్ల వద్ద ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ యే వస్తోంది. విడుదలకు ముందే సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను అమ్మేశారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్వర్స్ స్టార్ మా దక్కించుకుంది. అయితే పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాను.. స్టార్ మా కు అన్ని భాషల్లో ఛానెళ్లు ఉండడంతో అన్నింట్లోనూ వేయనుంది.

ఇక విరూపాక్ష ఓటీటీ వేధికగా ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో అనేది మాత్రం అధికారికంగా ఇంకా తెలియదు. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా 50 రోజుల థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా మే నెలలోనే రావచ్చని సమాచారం. ఇక ఇటీవలే విడుదలై హిట్టుగా నిలిచిన నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ల దసరా సినిమాను... నెట్ ఫ్లిక్స్ ఈనెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. అయితే విరూపాక్ష టాక్ ని బట్టి ఎన్ని రోజులు థియేటర్లలో ఉంటుందో దాన్ని బట్టి ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలో చెబుతారట.
మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ఈ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ చిత్రం కోసం సుకుమార్ కథ, కథనం అందించారు. విరూపాక్ష సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థల నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











