Virupaksha OTT: బాక్సాఫీస్ సెన్సేషన్ విరూపాక్ష ఓటీటీ రిలీజ్ లో సడన్ చేంజ్.. రిలీజ్ ఎప్పుడంటే?
సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా చిత్రం విరూపాక్ష. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఎలాంటి సైడ్ డీవియేషన్స్ లేకుండా దర్శకుడు కార్తిక్ దండు తాను చెప్పాలనుకున్న పాయింట్ అండ్ జోనర్ ని పెర్ఫెక్ట్ గా చెప్పారు. దీంతో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో ఈ తరహా కథాంశంతో సినిమా టాలీవుడ్ లో రాలేదనే టాక్ ని విరూపాక్ష సొంతం చేసుకుంది. అరుందతి తర్వాత ఆ స్థాయిలో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేయడంతో పాటు భయపెట్టింది. అదిరిపోయే ట్విస్ట్ లతో ఆద్యంతం అలరించింది. ఈ నేపథ్యంలో సినిమా ఏకంగా 80 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇది వరకు అతనికి వచ్చిన హిట్ మూవీస్ తో పోల్చుకుంటే హైయెస్ట్ షేర్, లాభాలు తీసుకొచ్చిన మూవీ విరూపాక్ష అని చెప్పాలి. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకి థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ తగ్గిపోవడంతో ఇప్పుడు ఒటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారని టాక్.

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం మే 21న విరూపాక్ష చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంట. ఆ రోజు సండే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంటి దగ్గర ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఒటీటీలో కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ డేట్ ని ఫిక్స్ చేయాలని నెట్ ఫ్లిక్స్ టీమ్ అనుకుంటుందంట. మొత్తానికి విరూపాక్షతో సక్సెస్ అందుకున్న తేజ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ విషయంలో మరింత ప్లాన్డ్ గా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆక్సిడెంట్ తర్వాత ఒకప్పటిలా డాన్స్ లు చేయడం ఇప్పట్లో కష్టం కాబట్టి మళ్ళీ కంటెంట్ బేస్డ్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నారనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











