Virupaksha OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన విరూపాక్ష.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్‌గా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. అయితే, గత ఏడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత ఈ మెగా హీరో కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఏమాత్రం పట్టువదలకుండా తిరిగి మేకప్ వేసుకుని 'విరూపాక్ష' అనే సినిమాను చేశాడు. గత నెలలోనే ఇది ప్రేక్షకుల మందుకు వచ్చింది.

కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమానే 'విరూపాక్ష'. హర్రర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తూ వచ్చింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 49 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 100 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు రూ. 25 కోట్లు వరకూ లాభాలు వచ్చాయి.

Sai Dharam Tej

హర్రర్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విరూపాక్ష' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారమే ఈ సినిమాను సదరు సంస్థ నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది. ఇందులో సెన్సార్ బోర్డ్ కట్ చేసిన సీన్స్‌ను కూడా యాడ్ చేశారని తెలిసింది. దీంతో దీనికి థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో వచ్చిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X