Gargi OTT Release: సాయి పల్లవి మరో థ్రిల్లింగ్ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాయి పల్లవి నటించిన గార్గి సినిమా జూలై 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ మలయాళం లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా సక్సెస్ కావాలి అని సాయి పల్లవి ప్రమోషన్స్ కూడా భారీగానే చేసింది. తెలుగులో రానా కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. ఇక తమిళంలో సూర్య ద్వారా కూడా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. మలయాళంలో మంచి మార్కెట్ ఉన్న సాయి పల్లవి ఈ సినిమాను కోసం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ అయితే బాగానే చేసింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ముఖ్యంగా తెలుగులో అయితే గత కొంతకాలంగా సాయిపల్లవి ఎలాంటి సినిమాలు చేసిన కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఇక ఎమోషనల్ డ్రామాగా ఒక తండ్రిని అన్యాయం నుంచి కాపాడేందుకు ఒక కూతురు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది ఈ సినిమాలోని కథ. చట్టపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు గార్గి సినిమా ఓటీటీ లో విడుదలకు సిద్ధమయ్యింది.

సోనీ లీవ్ లో ఆగస్టు 12వ తేదీన ఈ థ్రిల్లింగ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. గార్గి సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకమైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సాయి పల్లవికి తెలుగులో అయితే ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. చివరగా ఆమె లవ్ స్టోరీ శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన విరాటపర్వం సినిమా మాత్రం తీవ్రంగా డిజాస్టర్ అయ్యింది. మరి నెక్స్ట్ ఎలాంటి కధలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











