Gargi OTT: సాయి పల్లవి కొత్త ప్రయోగం.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?
విభిన్నమైన సినిమాలతో నటిగా మంచి గుర్తింపును అందుకున్న సాయి పల్లవి ఈసారి గార్గి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. డిఫరెంట్ సోషల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించినప్పటికీ కూడా థియేట్రికల్ గా ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కాస్త సందేహంగానే మారింది. ఈ సినిమాకు ది వారియర్ సినిమా పోటీగా ఒకరోజు ముందే థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు ఆ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి.
ఇక రెండవ రోజు కూడా పరిస్థితి అలానే ఉంటే ఈ పోటీలో సాయి పల్లవి ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనేది హాట్ టాపిక్ మారిపోయింది. అయితే ఇలాంటి సినిమాకు ఓటిటిలో తప్పకుండా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుంది అనే వివరాలు కూడా లీక్ అయ్యాయి.

గార్గి సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ లీవ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను థియేటర్లో విడుదల చేసిన నాలుగు వారాలు అనంతరం ఓటీటీ లో విడుదల చేయాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఇక గార్గి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతోకొంత రాణించగలిగితే మాత్రం వచ్చే నెలలో విడుదలవుతుంది.
కానీ రిజల్ట్ లో తేడా వస్తే మాత్రం ఓటీటీ సంస్థతోనే మరొక డీల్ సెట్ చేసుకొని కాస్త ముందుగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సాయి పల్లవి గతకొంత కాలంగా ఎలాంటి సినిమా చేసిన కూడా ఓటీటీ లో మాత్రం భారి స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. మొన్న విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినాప్పటికీ కూడా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఆ సినిమా ఒక వారం మొత్తం నెంబర్ వన్ ట్రెండింగ్ లిస్టులోనే కనిపించింది.


Click it and Unblock the Notifications











