Tiger 3 Movie OTT: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. టైగర్ 3 స్ట్రీమింగ్ వివరాలు లీక్
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ బడా సూపర్ స్టార్లు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒకడు. తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య పెద్దగా భారీ హిట్లను అందుకోవట్లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కనిపించాడు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే 'టైగర్ 3' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. మనీష్ శర్మ తెరకెక్కించిన చిత్రమే 'టైగర్ 3'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపించింది. అందుకు ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. నార్త్ అండ్ సౌత్‌లో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. ఇక, తాజాగా 'టైగర్ 3' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ 3' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే నవంబర్ 12న విడుదలైన 'టైగర్ 3' జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'టైగర్ 3'ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











