Tiger 3 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న టైగర్ 3.. ఇంత త్వరగా వస్తుందని ఊహించారా!
ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్న హీరోలు ఇండియాలో చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ తనదైన రీతిలో ముందుకెళ్తున్నాడు.
ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సల్మాన్ ఖాన్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కనిపించాడు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే 'టైగర్ 3' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి ఆశించినట్లుగా రాలేదు.

క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ 3' మూవీకి నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా దాదాపు రూ. 30 కోట్లు నష్టాలతోనే ఈ చిత్రం నిరాశ పరిచింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌కు మరో షాక్ కూడా తగిలినట్లైంది.
హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 'టైగర్ 3' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేశారు.
'టైగర్ 3' మూవీకి థియేటర్లలో నిరాశే ఎదురు కావడంతో ఓటీటీలోకి త్వరగానే తీసుకు రావాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే అంటే డిసెంబర్ 12వ తేదీనే స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందని బీ టౌన్ వర్గాల ద్వారా తెలిసింది.

ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'టైగర్ 3'ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











