సర్‌ప్రైజ్: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఫ్యాన్స్‌కు అదిరే గిఫ్ట్ కూడా!
వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను ఏర్పరచుకున్న ఇండియన్ హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. అంతలా అతడు చాలా ఏళ్లుగా తనదైన సినిమాలతో అన్ని వర్గాల వాళ్లను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ కొట్టలేదు. అయినా ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సల్మాన్ ఖాన్.. ఈ సారి విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'టైగర్ 3' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన ఈ మూవీని మనీష్ శర్మ తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి చాలా తక్కువగానే వచ్చింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'టైగర్ 3' మూవీకి నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా దాదాపు రూ. 30 కోట్లు నష్టాలతోనే ఈ చిత్రం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌కు మరో షాక్ కూడా తగిలినట్లు అయింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'టైగర్ 3' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అంతేకాదు, దీన్ని 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.

'టైగర్ 3' మూవీకి థియేటర్లలో నిరాశే ఎదురు కావడంతో ఓటీటీలోకి త్వరగానే తీసుకు రావాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెచ్చేసి సర్‌ప్రైజ్ చేసింది. అంతేకాదు, సెన్సార్ కాని వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా తెలిసింది.
ఇదిలా ఉండగా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'టైగర్ 3'ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











