Tiger 3 on OTT సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రం భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రొటీన్ ఫార్మూలతో రూపొందిందనే కారణాల వల్ల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. సినీ విమర్శకులు స్పందన అంతంతా మాత్రంగా ఉండటంతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దాంతో రికార్డు వసూళ్లు లేకుండా బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని ముగిసింది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఏ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ అవుతున్నదనే వివరాల్లోకి వెళితే..

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన టైగర్ 3 చిత్రం 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాకు కనీసం 300 కోట్ల రూపాయలుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా వ్యాల్యూ కట్టారు. ఈ సినిమాను 5400 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

Salman Khans Tiger 3 to Stream on OTT: Here is date, Where to watch details

ఇక టైగర్ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీ వెర్షన్ 260 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈచిత్రం 286 కోట్లు షేర్, 335 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అయితే టైగర్ 3 చిత్రాన్ని డిసెంబర్ 31వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ బాలీవుడ్‌లో ఏ సినిమానైనా రిలీజ్ తర్వాత కనీసం 8 వారాలు గడిచిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన కారణంగా మూవీని విడుదల ఆగిపోయింది.

Salman Khans Tiger 3 to Stream on OTT: Here is date, Where to watch details

టైగర్ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోను దక్కించుకొన్నది. దాంతో ఈ సినిమాను జనవర్ 5వ తేదీన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓటీటీ నిబంధనలను అతిక్రమించకుండా 8 వారాల తర్వాత ఈ చిత్రం గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X