Samajavaragamana OTT: ఓటీటీలోకి శ్రీ విష్ణు సూపర్ హిట్ మూవీ.. ఆ సీన్స్ కూడా ఉంటాయా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు. అందులో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. ఆరంభం నుంచే మంచి మంచి చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. చాలా కాలంగా హిట్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతోన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న కసితో ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
శ్రీ విష్ణు హీరోగా.. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రమే 'సామజవరగమన'. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదిరిపోయేలా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో క్లీన్ హిట్‌గా నిలిచి దాదాపు రూ. 11 కోట్లు లాభాలను కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సామజవరగమన' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ మేరకు ఆహా సంస్థ ట్విట్టర్ ఖాతాలో 'నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. సామజవరగమన దానికి చక్కటి రూపం.. ఇక నో ఆలస్యం.. ఈ నెల 28న ఆహాలో కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక, ఈ చిత్రంలో సెన్సార్ అయిన సీన్స్ కూడా యాడ్ చేస్తారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'సామజవరగమన' మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ చేసింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











