OTT: సమంత ఎమోషనల్ పోస్ట్.. "తుంబాడ్" దర్శకుడు భారీ సిరీస్ పై ఏమంటుందంటే..

సౌత్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్ వరకు వెళ్లిన పలువురు స్టార్ హీరోయిన్స్ లో గ్లామరస్ క్వీన్ సమంత కూడా ఒకరు అని చెప్పాలి. మరి కెరీర్ లో చిన్న చిన్న రోల్స్ తోనే స్టార్ట్ చేసి ఇప్పుడు సామ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. కాగా ఒక్క సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా సమంత చేస్తుంది. అయితే సమంత కెరీర్ లో ఇప్పుడు వరకు చాలా ఒడిదుగులు చూసేసింది.

అది తన కెరీర్ పరంగా కానీ తన పర్సనల్ లైఫ్ పరంగా చూసేసింది అని చెప్పాలి. కాగా గత కొన్నాళ్ల నుంచి సమంత సినిమా లైఫ్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తానై వచ్చిన కండరాల సంబంధించిన వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఈ గ్యాప్ ని తీసుకుంది.

samantha emotional post goes viral and opens up on web series with tumbbad director

సరే ఇది పక్కన పెడితే తన మాజీ భర్త టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి అనౌన్స్ చేయడంతో సమంత దీనిపై ఎలాంటి రియాక్షన్ ని ఇవ్వకపోయినప్పటికీ ఈమెనే మాజీ భార్య కావడంతో సామ్ మరోసారి సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంది కానీ సమంత మళ్ళీ కం బ్యాక్ లో మాత్రం క్రేజీ ప్లానింగ్స్ ని సెట్ చేసుకుంది అని చెప్పాలి.

ఇది సినిమా పరంగానే కాకండా ఓటిటి పరంగా కూడా గ్రాండ్ ప్లానింగ్స్ నే సామ్ సెట్ చేసుకుంది. అలా తన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" ని కంప్లీట్ చేసి ఈ నవంబర్ లో రిలీజ్ కి తీసుకొస్తుంది. కానీ ఈ సిరీస్ కాకుండా మరో సంచలన వెబ్ సిరీస్ ని ఈమె ఓకే చేసినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే హిందీ సెన్సేషనల్ కల్ట్ హిట్ చిత్రం "తుంబాడ్" దర్శకుడు అనీల్ రాహి భార్వే ప్లాన్ చేసిన మిస్టరీ, పీరియాడిక్ సిరీస్ "రక్త బ్రహ్మాండ్".

అయితే ఈ సిరీస్ లో ఇన్ని రోజులు సమంత ఉందని కేవలం వార్తలు వినిపించాయి. కానీ ఈమె లేటెస్ట్ పోస్ట్ తో అయితే సమంత కూడా భాగమే అని ఖరారైంది. అలాగే దీనిపై సమంత ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. కలలు కనడం ఎప్పటికీ ఆపొద్దు, మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ సినిమా సెట్స్ లో అడుగు పెట్టడం ఎంతో భావోద్వేగంగా ఉంది అంటూ ఎమోషనల్ ఎమోజి పెట్టి సమంత తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసింది.

దీనితో ఈ భారీ సిరీస్ విషయంలో సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సిరీస్ లో కూడా సమంతపై చాలా బోల్డ్ సీన్స్ అండ్ మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ ఉంది. అలాగే ఈమె మీర్జాపూర్ ఫేమ్ గుడ్డు భయ్యా పాత్రదారుడు సరసన నటిస్తుందట. ఇంకా ఈ సిరీస్ ని సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ దర్శకులు రాజ్ ఆండ్ డీకే లు నిర్మాణం వహిస్తుండగా ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ ని అనౌన్స్ చేశారు.

More from Filmibeat

Read more about: samantha ali fazal tumbbad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X